Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Diwali 'Every Day'

ఈ సంచికలో >> సినిమా >>

ఇంకోస్సారి బాలీవుడ్‌కి చెక్కేస్తున్న 'రౌడీ' సినిమా.!

rowdy movie remake in bollywood

సెన్సేషనల్‌ స్టార్‌, రౌడీ స్టార్‌ అని ఫ్యాన్స్‌ ముద్దుగా పిలుచుకునే హీరో విజయ్‌ దేవరకొండ. ఈయన నటించిన ఒక బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'అర్జున్‌ రెడ్డి', బాలీవుడ్‌లో 'కబీర్‌ సింగ్‌' పేరుతో రీమేక్‌ అయ్యి అక్కడా బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ఆ కోవలో ఇప్పుడు ఇంకో సినిమా చేరేలా ఉంది. తెలుగులో విజయ్‌ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమాని కూడా బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రముఖ దర్శకుడు రోహిత్‌ శెట్టి ఈ సినిమా రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. అయితే, మన రౌడీ ప్లేస్‌లో నటించబోయే ఆ బాలీవుడ్‌ హీరో ఎవరు.? అంటే, జాన్వీకపూర్‌ తెరంగేట్రం మూవీ 'ధడక్‌'లో నటించిన యంగ్‌ హీరో ఇషాన్‌ ఖత్తర్‌ అని తెలుస్తోంది.

'గీత గోవిందం' ఓ క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అని తెలిసిన సంగతే. అయితే, బాలీవుడ్‌ రీమేక్‌ కోసం ఈ సినిమాలో చాలానే మార్పులు చేయనున్నారట. మరి ఇషాన్‌తో జోడీ కట్టబోయే ఆ క్యూట్‌ భామ ఎవరో తెలియాల్సి ఉంది. ఇక ఇషాన్‌ విషయానికి వస్తే, హీరోగా తొలి సినిమానే అయినా, 'ధడక్‌'లో మంచి నటన కనబరిచాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఒకవేళ ఈ సినిమా కన్‌ఫామ్‌ అయితే, ఇదే ఇషాన్‌కి రెండో సినిమా కానుందేమో.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam