Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anubandhalu telugu serial twenty ninth Part

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

కనెక్టికట్ రాష్ట్రంలోని మాంచెస్టర్ అనే ఊళ్ళో ఓ దొంగ ఓ ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్ లోకి అదీ మూసేసే సమయంలో వెళ్లి తుపాకి చూపించి నగదు దోచుకున్నాడు. అంతటితో ఆగక, తనకి ప్రత్యేకంగా ఓ పిజ్జాని తయారు చేయించుకున్నాడు. అది తిన్న కొద్దిసేపటికే అతనికి స్పృహ తప్పింది. వంటవాడు తన నిద్రమాత్రలను ఆ పిజ్జాలో రహస్యంగా కలిపాడు.



వియార్క్ లోని గ్రాంటన్ అనే ఊళ్ళోని లేండ్ బర్గ్ (18) అనే దొంగ గుళ్ళు లేని 22 కాలిబర్ హేండ్ గన్ ని ఆగివున్న కారులో డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉన్న జెస్సికా (19) అనే ఆమెకు చూపించి హ్యాండ్ బాగ్ ఇవ్వమని కోరాడు. ఆమె ఇచ్చాక తెరిచి చూస్తే అందులో డబ్బు లేదు. క్రెడిట్ కార్డులు, చెక్కుబుక్కులు కనిపించాయి. తన పేర చెక్ రాయమని కోరాడా దొంగ.

ఆమె రాసిస్తే మర్నాడు బ్యాంక్ కి దాన్ని క్యాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, లేండ్ బర్గ్ వస్తాడని ఎదురుచూడకపోయినా అక్కడ కాపున్న పోలీసులకి అతను చిక్కాడు. ఈ అమాయకపు దొంగ మొదటి దొంగతనం ప్రయత్నం ఇది.

గతంలో కనీసం లైబ్రరీ పుస్తకం కూడా దొంగిలించని అతన్ని చూసి కోర్టులో అంతా నవ్వుతుంటే, సిగ్గుతో తలవంచుకున్నాడు. జడ్జి కూడా నవ్వుతూ అతనికి తక్కువ శిక్ష విధించాడు.

 

మరిన్ని సీరియల్స్