Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-1 by Bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

క‌ల్లో కూడా ఊహించ‌ని ప్ర‌యాణం ఇది...

Interview with Anushka

అనుష్క‌... హీరోయిన్ల‌లో హీరోలాంటిది!
అవును... క‌థ‌ల‌న్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ క‌థ‌ల్లో యుద్దాలు చేస్తోంది. క‌త్తి తిప్పుతోంది. గుర్ర‌పు స‌వారీ చేస్తోంది. హీరో లేడ‌నే లోటు క‌నిపించ‌నివ్వ‌డం లేదు. ఒక వేళ హీరో ఉన్నా చూపుల‌న్నీ ఆమెపైనే. ఆమెపై కోట్లు గుమ్మ‌రించే నిర్మాత‌లున్నారు. ఆమె కోసమే క‌థ‌లు రాసుకొనే ద‌ర్శ‌కులున్నారు. ఆమె ప‌క్క‌న న‌టించాల‌ని ఎదురుచూసే హీరోలున్నారు. ఆమె కోసం క్యూలో నిల‌బ‌డే ప్రేక్ష‌కులున్నారు. అందుకే ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో ఉంది. వ‌ర్ణ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రుద్ర‌మ‌దేవి సెట్స్ పై ఉంది. మ‌రోవైపు బాహుబ‌లి షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. తీర‌క‌లేని షెడ్యూళ్ల‌తో బిజీగా ఉన్న అనుష్క‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది...

చేతిలో రెండు పెద్ద సినిమాలు... బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి. ఎలా గ‌డుస్తున్నాయి రోజులు...??
- (న‌వ్వుతూ) నిరంత‌రం ఉత్కంఠ‌త‌తో. అవును... ఈ సినిమాల కోసం చాలా ఆస‌క్తిగా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. ఈ విష‌యం తెలిసి... రెండు టీమ్‌లూ అత్యంత జాగ్ర‌త్త‌గా ప‌నిచేస్తున్నాయి. ఇంత మంచి సినిమాల్లో భాగం పంచుకొన్నందుకు నాకు చాలా గ‌ర్వంగా ఉంది.

రెండూ భారీ ప్రాజెక్టులే. మ‌రి డేట్లు ఎలా కేటాయించారు?
- నెల‌లో ప‌దిహేను రోజులు బాహుబ‌లికి, మ‌రో ప‌దిహేను రోజులు రుద్ర‌మ‌దేవికీ కేటాయించా. నెలంతా ఈ రెండు సినిమాల‌తోనే స‌రిపోయింది. ఏప్రెల్ వ‌ర‌కూ వీటితోనే స‌రిపోతోంది.

వ‌ర్ణ ఫ‌లితం నిరాశ‌ప‌రిచిందా?
- చాలా మంచి సినిమా. ఇప్ప‌టికీ న‌మ్ముతున్నా. ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంద‌ని. క‌థ చెబుతున్న‌ప్పుడు చాలా థ్రిల్ పీల‌య్యా. సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కూ అంతే థ్రిల్ క‌లుగుతుంది అనుకొన్నా. కానీ దుర‌దృష్టం ఫ‌లితం రాలేదు. కానీ మ‌న‌సులో ఏదో మూల ఆశ ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు జ‌నంలోకి వెళ్ల‌డానికి కాస్త స‌మ‌యం తీసుకొంటాయి. అంత వ‌ర‌కూ ఎదురుచూడాలి.

ఈ సినిమా కోసం కూడా చాలా క‌ష్ట‌ప‌డ్డారు క‌దా..?
- అవును. మైన‌స్ డిగ్రీల సెల్సియ‌స్ వాతావ‌ర‌ణంలో తొంభై రోజులు ప‌నిచేశాం. చాలా దుర్భ‌రంగా గ‌డిచిన కాల‌మది. ఓ మంచి సినిమాకోసం క‌ష్ట‌ప‌డినా త‌ప్పులేదు.. అని ధైర్యం తెచ్చుకొని ప‌నిచేశాం. క‌నీసం అక్క‌డ బాత్‌రూమ్‌లు కూడా అందుబాటులో లేవు.

హీరోయిన్ అంటే అది కావాలి, ఇది కావాలి... అని డిమాండ్లు చేస్తుంటారే. మ‌రి మీరు అక్క‌డ ఎలాంటి డిమాండ్లూ చేయ‌లేదా?
- (న‌వ్వుతూ) అక్క‌డ ఏమైనా ఉంటే క‌దా, చేయ‌డానికి...? అయినా నేను నిర్మాత‌ల్ని పీడించే క‌థానాయిక‌ను కాదు. నాకు కావ‌ల్సిన పారితోషికం స‌కాలంలో ఇచ్చేస్తున్నారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టొచ్చా..?

మిమ్మ‌ల్ని రూ.50 కోట్ల క‌థానాయిక అంటున్నారు..?
- అది న‌న్ను చూసి పెడుతున్న పెట్టుబ‌డి కాదు, క‌థ‌ని న‌మ్మి... పెట్టుబ‌డి పెడుతున్నారు. ఆ గొప్ప‌ద‌నం క‌థ‌ల‌దీ, వాటిని న‌మ్ముతున్న నిర్మాత‌ల‌దీ. నాది కాదు.

వ‌ర్ణ‌, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి... ఈప్ర‌యాణం ఎలా సాగుతోంది?
- చాలా అద్భుతంగా. క‌ల‌లో కూడా ఊహించ‌ని ప్ర‌యాణం ఇది. నాకు ఇలాంటి పాత్ర ఒక్క‌టైనా రావాలి... అని ప్ర‌తి క‌థానాయికా క‌ల‌లు కంటోంది. అలాంటి పాత్ర‌లు నాకు వ‌రుస‌గా ద‌క్క‌డం నిజంగా నా అదృష్టం. ఓ క‌థానాయిక‌కు ఇంత‌కంటే ఏం కావాలి?

కానీ ఇక ముందు కత్తి ప‌ట్ట‌ను, డాన్స్ మాత్ర‌మే చేస్తా అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు?
- (న‌వ్వుతూ) క‌త్తి తిప్పి తిప్పి బోర్ కొట్టేసిందండీ. అందుకే అలా అన్నా. నిజానికి రుద్ర‌మ‌దేవి, వ‌ర్ణ‌లాంటి క‌థ‌లు అరుదుగా వ‌స్తాయి. క‌థానాయిక‌లు రెగ్యుల‌ర్ సినిమాల‌తోనే కాల‌క్షేపం చేయాలి. మ‌ధ్య మ‌ధ్య‌లో ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తుంటే న‌టిగా సంతృప్తి దొరుకుతుంది. రెగ్యుల‌ర్ సినిమాలంటే కాస్త రిలాక్స్‌గా షూటింగ్‌కి వెళ్లొచ్చు క‌దా..? అందుకే ఆ నిర్ణ‌యం తీసుకొన్నా.

ఈ సినిమాల్లో ప‌డిపోయి వ్య‌క్తిగత జీవితం కోల్పోయా అనిపించిందా?
- అలాందిదేం లేదు. నా జీవితం నాకుంది. ఖాళీ దొరికితే చాలు. బెంగ‌ళూరు వెళ్లిపోతా. అక్క‌డి స్నేహితుల‌తో ఆటా పాటా ఎప్పుడూ ఉంటుంది.

ఓట‌మిని అంగీక‌రిస్తారా?
- ఓడిపోయాం అని తెలిసిన‌ప్పుడు కాస్త బాధ ఉంటుంది. అరె... క‌ష్ట‌ప‌డ్డాం క‌దా, ఎక్క‌డ త‌ప్పుజ‌రిగింది?? అంటూ ఎన్నో ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తాయి. వాటికి స‌మాధానం చెప్పుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ ఓట‌మిని అంగీక‌రించ‌క త‌ప్ప‌దు. గెలిచిన‌ప్పుడు భుజాలు ఎగ‌రేయ‌డం కాదు. ఓడిన‌ప్పుడు ఒప్పుకొని తీరాలి.

మీపై వ‌చ్చే గాసిప్పుల‌కు ఎలా స్పందిస్తారు?
- గాసిప్పులు మామూలే క‌దా..? ఎవ‌రిపై పుట్ట‌డం లేదు చెప్పండి? అయితే అవి స‌ర‌దాగా విని, వదిలేసేలా ఉండాలి. హద్దుదాటితే ప్ర‌మాద‌మే.

మీ పెళ్లెప్పుడు?
- ఈ ప్ర‌శ్న‌ లేకుండా నా ఇంట‌ర్వ్యూ ఏదీ పూర్తికావ‌డం లేదీమ‌ధ్య‌. త్వ‌ర‌లో నేనే చెబుతా. అప్పుడు రాసుకొందురు గానీ.

ప్రేమ వివాహ‌మేనా?
- చూద్దాం. దేవుడు ఎలా రాసిపెట్టాడో..??

స‌రే ఆల్ ది బెస్ట్‌...
- ధ్యాంక్యూ వెరీమ‌చ్‌.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Venkatadri Express