Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
directors became producers

ఈ సంచికలో >> సినిమా >>

యాంటీ సెంటిమెంటొద్దు

anti sentiment

సినిమాకీ సెంటిమెంట్‌కీ ఉన్న లింకు చాలానే. సెంటిమెంట్‌ సీన్స్‌ని ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకుంటారు గనుక, ఆ జోనర్‌ సినిమాలు ఎక్కువగానే వస్తుంటాయి. ప్రత్యేకంగా సెంటిమెంట్‌ జోనర్‌ సినిమాలపై స్టార్‌ హీరోలు కూడా దృష్టిపెడ్తారు. సెంటిమెంట్‌ సినిమాలకున్న క్రేజ్‌ అలాంటిది.

కానీ, అదే యాంటీ సెంటిమెంట్‌ అయితే, అది వాస్తవిక ఘటన అయినా ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకోరు. ‘భూత్‌`2’ సినిమా కూడా అలాగే ఫెయిల్‌ అయ్యింది. తల్లిదండ్రులు, దయ్యం పట్టిన తమ కూతుర్ని చంపేస్తారు ఆ సినిమాలో. సినిమా ఎలా వుంది? అని దాన్ని సినిమాగా చూడలేదు, సినిమాలోని కంటెంట్‌ నచ్చక తిరస్కరించారు.

దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి హత్యోదంతం సినిమాగా తెరకెక్కించినా అది విజయం సాధించే అవకాశాలుండవు. ఎందుకంటే, ఇది కూడా యాంటీ సెంటిమెంటే. తల్లిదండ్రులే ఆరుషిని హత్య చేశారని కోర్టు తీర్పునిచ్చినా, దాన్ని వాస్తవంగా అంగీకరించలేకపోతున్నారు. భారతీయుల సెంటిమెంట్లు అలాంటివి. యాంటీ సెంటిమెంట్‌ వద్దు అని నిర్మొహమాటంగా ప్రేక్షకులు తిరస్కరించడంలోనే, భారతీయుల ఆలోచనలెలా వుంటాయో స్పష్టమవుతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
super star