Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anti sentiment

ఈ సంచికలో >> సినిమా >>

సూపర్‌స్టార్‌కి దూరంగా సూపర్‌స్టార్‌

super star

ఇద్దరు సూపర్‌స్టార్స్‌ ఈ సంక్రాంతికి తమ సినిమాలతో ప్రేక్షకుల్ని రంజింపజేస్తారని వార్తలు వచ్చాయి కొన్ని రోజుల క్రితం వరకు. వారిలో ఒకరు తెలుగు సూపర్‌స్టార్‌ మహేష్‌ అయితే, ఇంకొకరు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఎప్పటినుంచో విడుదల ఇదిగో అదిగో అంటున్న ‘కొచాడియాన్‌’ (తెలుగులో ఈ సినిమా పేరు ‘విక్రమసింహా’) సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. మహేష్‌ ‘1’ కూడా సంక్రాంతి బరిలోనే నిలిచింది.

కాని అనూహ్యంగా ‘కొచాడియాన్‌’ సంక్రాంతి బరిలోంచి తప్పుకుంది. దాంతో రేసులో ఒక్క సూపర్‌స్టార్‌ మాత్రమే నిలిచాడు తెలుగులో. పేరుకి తమిళ నటుడు అయినా, తెలుగులో స్టార్‌ హీరోలతో సమానంగా వసూళ్ళు రాబట్టే సత్తా రజనీకాంత్‌కి వుంది. అందుకే అతను సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ అయ్యాడు.

మహేష్‌ విషయానికి వస్తే ‘1’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్‌ సిక్స్‌ ప్యాక్‌తో కన్పిస్తాడన్న వార్తలతో సినిమాపై అంచనాలు ఇంకా బాగా పెరిగిపోతున్నాయి. సుకుమార్‌ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. సంక్రాంతి అంటే తెలుగువారికి పెద్ద పండుగ. సినిమా వారికి ఇంకా పెద్ద పండుగ. గత ఏడాది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో సంక్రాంతి హిట్‌ కొట్టాడు మహేష్‌. ఈసారి ‘1’ అంటూ బాక్సాఫీస్‌ని రూల్‌ చేయబోతున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
that is mahesh