Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
super star

ఈ సంచికలో >> సినిమా >>

దటీజ్‌ మహేష్‌

that is mahesh

ఆర్థికంగా, పాపులారిటీ పరంగా ఎదగడం కాదు, మనిషిగా ఎదగడం ముఖ్యం. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకుంటారు ఎవరైనా. సినీ ప్రముఖులు ఈ విషయంలో మిగతా రంగాల వారికి భిన్నంగా వ్యవహరిస్తారు. ‘చేయూత’ అందించడానికి ఎప్పుడూ ముందుంటారు.

మహేష్‌ కూడా అంతే. 15 నుంచి 20 బ్రాండ్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న మహేష్‌, సినిమా షూటింగులతోనూ బిజీగా వుంటున్నా సామాజిక బాధ్యత మరువలేదు. ‘హీల్‌ ఎ ఛైల్డ్‌’ అనే కాన్సెప్ట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘హీల్‌ ఎ ఛైల్డ్‌’ అంటూ పేదరికంతో మగ్గుతున్న, అనారోగ్యానికి గురైన చిన్న పిల్లల్ని ఆదుకునే కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాడు.

రక్తదానం, నేత్రదానం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ, తానే ఓ ట్రస్ట్‌ నిర్వహిస్తూ చిరంజీవి తన ప్రత్యేకతను చాటుకుంటే, మహేష్‌ ‘హీల్‌ ఎ ఛైల్డ్‌’ అంటూ ఓ గొప్ప కార్యక్రమానికి ప్రచారకర్తగా తోడ్పాటు అందిస్తున్నాడు. మహేష్‌ కోరితే పెద్ద మొత్తంలో ఆ సంస్థ ఆయనకు చెల్లించుకునేదే. కానీ, సామాజిక బాధ్యతలో భాగంగా మహేష్‌, రెమ్యునరేషన్‌ తీసుకోకుండా ఆ మంచి పని గురించి అందరికీ తెలియజెబుతున్నాడు. దటీజ్‌ మహేష్‌.

మరిన్ని సినిమా కబుర్లు
exposing