Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
that is mahesh

ఈ సంచికలో >> సినిమా >>

వయసు పెరిగే కొద్దీ ఆరబోత

exposing

వయసు మీద పడే సరికి, హుందాతనంతో కూడిన పాత్రల్లో కన్పించాలనుకునేవారు నిన్నటితరం తారామణులు. పాతికేళ్ళు దాటితే కెరీర్‌ ముగిసిపోయిందని భావించేవారు ఒకప్పుడు. ఇప్పుడలా కాదు, తెలుగులోనూ 30 ఏళ్ళ వయసులోనూ హాట్‌ హాట్‌ పాత్రల్లో మెరిసిపోవాలనుకుంటున్నారు తారామణులు.

హిందీలో అయితే ఫార్టీస్‌లోనూ హాట్‌ బ్యూటీస్‌ అనిపించుకోవడానికి హీరోయిన్లు తహతహలాడుతున్నారు. నేహా ధూపియా, అమీషాపటేల్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ హాట్‌గా తమ గురించి అందరూ చర్చించుకోవాలని ఆశిస్తూ, ఆ దిశగా హాట్‌ అప్పీల్‌తో ఫొటో సెషన్లు చేయించుకుంటున్నారు.

సినిమా అనేది గ్లామర్‌ ఇండస్ట్రీ కావడంతో, వయసు పెరిగినా అందంతో అవకాశాలు కొల్లగొట్టవచ్చని అమీషా, నేహా మాత్రమే కాదు, బాలీవుడ్‌ నటీమణులంతా ఓ ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు. అందుకే, అక్కడ హీరోయిన్లకు వయసు మీద పడే కొద్దీ సరికొత్త అందంతో కన్పిస్తుంటారు. కన్పించడం మాటెలా వున్నా, కన్పించడానికి ప్రయత్నిస్తుంటారు. అదే తమకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తుందనే ఆలోచన వారిది.

మరిన్ని సినిమా కబుర్లు
lands in vizag