Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Anushka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - వెంకటాద్రి ఎక్స్ ప్రెస్

Movie Review - Venkatadri Express

చిత్రం: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నాగినీడు, తాగుబోతు రమేష్‌, బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాష్‌రెడ్డి, ఎం.ఎస్‌. నారాయణ తదితరులు
ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు
సంగీతం: రమణ గోగుల
నిర్మాణం: ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌
నిర్మాత: జెమిని కిరణ్‌
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
విడుదల తేదీ: 29/11/2013

క్లుప్తంగా చెప్పాలంటే :
సందీప్‌ (సందీప్‌ కిషన్‌) మంచి మనసున్న కుర్రాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తాను ఆదుకుంటానంటాడు. చెడుకి వ్యతిరేకంగా పోరాడతాడు. అదే అతన్ని, అతని తండ్రి దృష్టిలో చెడ్డవాడ్ని చేస్తుంది. క్రమశిక్షణకు మారు పేరైన సందీప్‌ తండ్రి (నాగినీడు) దృష్టిలో, సందీప్‌కి ఆఖరి ఛాన్స్‌ మిగిలి వుంటుంది. సందీప్‌ సోదరుడి (బ్రహ్మాజీ) పెళ్ళి కోసం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కుటుంబమంతా బయల్దేరతారు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ ట్రెయిన్‌ మిస్‌ అవుతాడు సందీప్‌. ఈ క్రమంలో ప్రార్థన (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) పరిచయమవుతుంది సందీప్‌కి. సందీప్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మధ్య ఏం జరిగింది? ట్రెయిన్‌ మిస్‌ అయిన సందీప్‌ తండ్రికి దూరమవుతాడా? అనేవి తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
నటుడిగా సందీప్‌ ఇప్పటికే తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. కానీ యువ హీరోగా నిలదొక్కుకోవడానికి సరైన కమర్షియల్‌ హిట్‌ మాత్రం అతనికి దొరకలేదు. ఆ లోటు ఈ సినిమా పూడ్చే అవకాశం వుంది. తనకు వచ్చిన అవకాశాన్ని సందీప్‌ కిషన్‌ సద్వినియోగం చేసుకున్నాడు. ఎక్కడ ఎంత అవసరమో, అంత పెర్ఫామెన్స్‌ ఇచ్చి నటుడిగా ఆకట్టుకున్నాడు. కొత్తమ్మాయి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అందంగా కన్పించింది. నటనలో నేర్చుకోవాల్సింది చాలా వుంది. నాగినీడు మామూలే. తాగుబోతు రమేష్‌ నవ్వించాడు. సప్తగిరి కూడా కామెడీ విభాగానికి న్యాయం చేశాడు. జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ ఓకే. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల వరకు ఫర్వాలేదన్పించారు.

మంచి కథ, దాన్ని అందంగా చెప్పడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది, పాటల్లో రెండు బావున్నాయి. ఒకప్పుడు స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన రమణ గోగుల నుంచి ఆ స్థాయి మ్యూజిక్‌ ఇటీవలి కాలంలో లేదనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో రమణ గోగుల మ్యూజిక్‌ బాగానే వుందన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి కొత్త అందాన్నిచ్చింది, కొన్ని సన్నివేశాలకు రిచ్‌నెస్‌ అద్దింది. ఫస్టాఫ్‌ ఆకట్టుకుంటుంది. సెకెండాఫ్‌లో రొమాన్స్‌, సెంటిమెంట్‌ పండినా, ఎడిటింగ్‌కి ఇంకాస్త పని చెప్పి వుండాల్సిందనిపిస్తుంది.

మాటల్లో చెప్పాలంటే :
మంచి కథే, ఇంకాస్త ఎనర్జిటిక్‌గా వుండాల్సింది

అంకెల్లో చెప్పాలంటే : 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cini churaka by cartoonist bannu