Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

సైరా'తో చిరంజీవి సాధించిందేంటీ.?

Chiranjeevi  with syeraa

'సైరా' సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది. బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని రికార్డులు కొల్లగొట్టింది అనే విషయం గురించి ఇప్పుడంతా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వసూళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయలేదని చిరంజీవి అన్నారు. తన కెరీర్‌లో ఇలాంటి సినిమా ఒకటి చేయాలని కల కన్నాను. ఆ కల నెరవేడంతో పూర్తి సంతృప్తిగా ఉన్నాను.. అనేది ఒక ఎత్తు అయితే, మరుగున పడిపోయిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రను తెలుగు వారితో పాటు, దేశం మొత్తానికి పరిచయం చేశాననే తృప్తి ఇంకో ఎత్తు. ఇది చాలు. అంతే సినిమా సక్సెస్‌ అయ్యిందా.? లేదా.? కోట్లు కొల్లగొట్టిందా.? లేదా.? అనేది అస్సలు ఆలోచించను.. అని చిరంజీవి తెలిపారు. అవును నిజమే, చిరంజీవికి కోట్లు లెక్క కాదు. రికార్డులు అంతకన్నా లెక్క లేదు.

ఇక నెంబర్‌ వన్‌ పొజిషన్‌ గురించి మాట్లాడుకోవల్సి వస్తే, ఇప్పుడు నెంబర్‌ వన్‌ హీరోగా చెలామణీ అవుతోన్న మహేష్‌బాబే 1 - 10 చిరంజీవే. 11 వ స్థానం కోసమే మిగిలిన మేమంతా పోటీ పడాలి.. అని చెప్పిన తర్వాత కూడా నెంబర్‌ గురించి మాట్లాడుకోవడం అవివేకం. తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చి కూడా ఆఫీషియల్‌గా బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్లు కొల్లగొట్టి చూపించాడు చిరంజీవి. దటీజ్‌ చిరంజీవి. ఇంతకన్నా చిరంజీవి ఇంకేం సాధించాలి.

మరిన్ని సినిమా కబుర్లు
punarnavi's stategies in big boss