Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Chiranjeevi  with syeraa

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌బాస్‌పై పునర్నవి లెక్కలివే.!

punarnavi's stategies in big boss

బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ నుండి లేడీ మోనార్క్‌ పునర్నవి ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, హౌస్‌ నుండి వచ్చేసిన పునర్నవి మనసులో బిగ్‌బాస్‌పై కొన్ని లెక్కలున్నాయి. టాప్‌ 5 లిస్టులో వితిక ఖచ్చితంగా ఉంటుందని చెప్పింది. అలాగే తన ఫ్రెండ్స్‌ అయిన రాహుల్‌, వరుణ్‌ కూడా ఉండాలని కోరుకుంటున్నానంది. ఆ తర్వాత శ్రీముఖి, శివజ్యోతి ఉండొచ్చని అభిప్రాయ పడింది. అయితే నిజంగానే పునర్నవి ఎలిమినేషన్‌కి తక్కువ ఓట్లే కారణమా.? అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మహేష్‌ ఎలిమినేట్‌ అవుతాడని భావించిన నెటిజన్స్‌కి పునర్నవి ఎలిమినేషన్‌తో బిగ్‌ షాక్‌ తగిలింది.

ఇదిలా ఉంటే, ఎలిమినేషన్‌పై పునర్నవి హ్యాపీగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే, హీరోయిన్‌గా తాను చేయాల్సిన ప్రాజెక్టుల నిమిత్తం, ప్లాన్‌ ప్రకారమే పునర్నవి హౌస్‌ నుండి బయటికి రావల్సి వచ్చిందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. మొత్తానికి పునర్నవి ఎలిమినేషన్‌ సింపుల్‌గా జరిగిపోయింది. ఇదిలా ఉంటే, బిగ్‌బాస్‌ కంప్లీట్‌ అయిపోయా తన ఫ్రెండ్స్‌ అయిన రాహుల్‌, వితిక, వరుణ్‌లతో కలిసి పునర్నవి ఏం చేస్తుందో తెలుసా.? అమెరికా టూర్‌ వేస్తుందట. అంతకన్నా ముందే వరుణ్‌ ఇంట్లో గెట్‌ టుగెదర్‌ ప్లాన్‌ చేశారట. ఇది కంప్లీట్‌ కాగానే, ఈ నలుగురు బిగ్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కలిసి అమెరికా టూర్‌ చెక్కేస్తారట. కొన్ని రోజులు అక్కడే ఉండి ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తారట. ఆ తర్వాత తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌లపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తుందట పునర్నవి. పునర్నవి నటించిన 'సైకిల్‌' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. 'ఒక చిన్న విరామం' అనే మరో మూవీ షూటింగ్‌ దశలో ఉంది.

మరిన్ని సినిమా కబుర్లు
Mega Chance Hitting Ismart Girl!