Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Mega Chance Hitting Ismart Girl!

ఈ సంచికలో >> సినిమా >>

కొరటాల సినిమాలో జేజమ్మ.

Jejamma in Koratala Movie.!

'సైరా'తో లైఫ్‌ టైమ్‌ డ్రీమ్‌ని నెరవేర్చుకున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇక మిగిలింది ఫ్యాన్స్‌ కోసం వీలైనన్ని కమర్షియల్‌ సినిమాలను అందించడమే. అందుకు ఆల్రెడీ మెగా స్కెచ్‌ కూడా ప్రిపేర్‌ అయిపోయింది. విజయ దశమి సందర్భంగా కొరటాల శివతో చిరంజీవి చేస్తున్న సినిమా స్టార్ట్‌ అయిపోయింది. ఇక త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసేయనున్నారు. ఇక ఈ సినిమాలో చిరుతో జత కట్టబోయే హీరోయిన్‌పై ఫోకస్‌ మొదలైంది. ఆ హీరోయిన్‌ లిస్టులో అనుష్క పేరు చేరింది. ఆల్రెడీ 'సైరా' కోసం తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించేశారు.

ఇక ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ పోషించిన అనుష్క తన సరికొత్త లుక్స్‌తో ఫ్యాన్స్‌ని మెస్మరైజ్‌ చేసింది. దాంతో బాస్‌ సినిమాలో జేజమ్మే హీరోయిన్‌ అంటూ ఫిక్స్‌ అయిపోతున్నారు అభిమానులు. అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాలో జేజమ్మనే హీరోయిన్‌గా ఫైనల్‌ చేస్తారా.? అనేది వేచి చూడాలిక. వీలైనంత త్వరగా ఈ సినిమా కంప్లీట్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసేశాడట కొరటాల శివ. ముందుగానే పక్కాగా స్క్రిప్ట్‌ ప్రిపేర్‌ చేసుకోవడం, సినిమా కోసం చిరంజీవి తన లుక్స్‌ని పూర్తిగా మార్చేసుకోవడం చూస్తుంటే, ఇక చక చకా షూటింగ్‌ కంప్లీట్‌ చేయడమే మిగిలుందనిపిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి, కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
Trolling is good Vinayaka!