Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Director Teja Ever targeted!

ఈ సంచికలో >> సినిమా >>

అయ్యో బాలయ్యా.. టైటిల్‌ లొల్లి ఏందయ్యా.!

what happened!

బాలకృష్ణ - కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంటోంది ఈ సినిమా. అయితే, ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్‌ కన్‌ఫామ్‌ చేయలేదు. 'రూలర్‌', 'జడ్జిమెంట్‌'.. అంటూ రకరకాల టైటిల్‌ ప్రచారంలో ఉన్నాయి. కానీ, చిత్ర యూనిట్‌ ఇంతవరకూ టైటిల్‌పై అఫీషియల్‌ కన్‌ఫామేషన్‌ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే, తాజాగా జెమినీ టీవీ ఛానెల్‌ వారు 'రూలర్‌' సినిమా శాటిలైట్‌ హక్కుల్ని తాము దక్కించుకున్నామంటూ, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. అదేంటీ. బాలయ్య సినిమాకి 'రూలర్‌' అని టైటిల్‌ ఎప్పుడు కన్‌ఫామ్‌ చేశారు.. మీకు తెలుసా.. మీకు తెలుసా.? అంటూ ఎవరికి వారు తలలు పట్టుకున్నారు. కానీ, టైటిల్‌ విషయంలో జెమినీ టీవీ అత్యుత్సాహం ప్రదర్శించింది. చిత్రయూనిట్‌ అనుమతి లేకుండా, ఓ సినిమా టైటిల్‌ని వారెలా కన్‌ఫామ్‌ చేస్తారు.? అంటూ బాలయ్య ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

ఇంత లొల్లి జరుగుతున్నా, బాలయ్య అండ్‌ టీమ్‌ ఈ విషయంలో స్పందించలేదు. తక్షణమే స్పందించాల్సిన అంశమిది. అంటే 'రూలర్‌' టైటిల్‌కే బాలయ్య ఓటేశాడా.? నిజానికి మొదట్లో ఈ పేరు ప్రచారమైనా ఆ తర్వాత సినిమాకి 'జడ్జిమెంట్‌' అనే టైటిల్‌ అనుకుంటున్నామనే వార్త తెరపైకి వచ్చింది. ఏది ఏమైతేనేం, బాలయ్య టైటిల్‌ లొల్లి ఫ్యాన్స్‌లో పెద్ద దుమారమే లేపింది.

మరిన్ని సినిమా కబుర్లు
who is the winner