Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
what happened!

ఈ సంచికలో >> సినిమా >>

క్లైమాక్స్‌కి చేరిన బిగ్‌బాస్‌: విన్నర్‌ ఎవరంటే.!

who is the winner

గత 90 రోజులుగా బుల్లితెరపై రన్‌ అవుతోన్న బిగ్‌బాస్‌ రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. చివరి ఘట్టానికి చేరేసరికి బిగ్‌బాస్‌ ఫాలోవర్స్‌లో క్యూరియాసిటీ పెరిగింది. పునర్నవి, మహేష్‌ ఎలిమినేషన్స్‌తో హౌస్‌లో లోటు కనిపించినా, క్లైమాక్స్‌ మూడ్‌ దాన్ని అధిగమించేసింది. ఇక మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఏడుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్నారు. వీరిలో టాప్‌ 5 లో నిలిచేదెవరు.? ఈ వీక్‌ నామినేషన్‌ ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. 'టాపర్స్‌ ఆఫ్‌ ది హౌస్‌' అనే టాస్క్‌ మాటల యుద్ధంతో మొదలైంది. వరుణ్‌ - వితికలను టార్గెట్‌ చేస్తూ శివజ్యోతి ఓవరాక్షన్‌ చేసింది. దాంతో ఈ వారం నలుగురు మాత్రమే నామినేట్‌ కావల్సింది పోయి, హౌస్‌ మొత్తం నామినేట్‌ అయ్యేందుకు శివజ్యోతి కారణమైంది. శివజ్యోతి ఓవరాక్షన్‌తో ఆల్రెడీ సేఫ్‌ జోన్‌లో ఉండాల్సిన అలీ, శ్రీముఖి, వితికలతో పాటు, శివజ్యోతి, వరుణ్‌, రాహుల్‌, బాబా భాస్కర్‌ కూడా నామినేట్‌ అయ్యారు.

అంటే హౌస్‌లోని మొత్తం కంటెస్టెంట్స్‌పై వేటు పడింది. ఇదిలా ఉంటే, ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హౌస్‌లోకి రావడం స్టార్ట్‌ చేశారు. ఈ తరుణంలో బిగ్‌బాస్‌ హౌస్‌ మేట్స్‌కి ఫ్రీజింగ్‌, రష్‌ అవర్‌, స్లీప్‌ మూడ్‌.. వంటి టాస్క్‌లిచ్చి కొంత టెన్షన్‌ పెట్టాడు. అలా చివరి అంకం కొంత ఎమోషన్స్‌తో సాగుతోంది. ఇక ఈ వారం ఏడుగురు ఇంటి సభ్యుల్లో ఎలిమినేషన్‌ వేటు పడేదెవరికి.? టాప్‌ 5 లో నిలిచే ఆ కంటెస్టెంట్‌ వెరు.? అనేది తెలియాలంటే, కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ బిగ్‌బాస్‌.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam