Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope october 18th to octber 24th

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవయవాల మీద ఆధిపత్యం - ..

Dominance over organs

అంగమర్దన దాదాపు లుప్తమైపోతున్న అద్వితీయమైన యోగాభ్యాసం. పారంపర్యంగా సాంప్రదాయక యోగాభ్యాసంలో అంగమర్దన ఎప్పుడూ ఒక భాగం. అది యోగాసనాల వంటిది కాదు. ఏ పరికరాలూ లేకుండానే చేయగలిగిన అతి తీక్షణమైన వ్యాయామం. మీరు మీ శరీరాన్ని మాత్రమే ఉపయోగిస్తూ మీ భౌతిక దారుధ్యాన్ని ఇంకా పటుత్వాన్ని పూర్తిగా మరో స్థాయికి తీసుకెళతారు.అంగమర్దన సాధనలో మీరు మీ శరీర బరువును ఇంకా శరీర కదలికలను ఉపయోగిస్తూ, మీ కండరాలలో ఒదుగుబాటును కాలక్రమేణ పెంపొందించు కుంటారు. ఇప్పుడు మేము చెప్తున్న విధానంలో ఈ అభ్యాసం 25 నిమిషాలు మాత్రమే పడుతుంది, దానివల్ల మీ ఆరోగ్యానికీ ఇంకా శ్రేయస్సుకు కలిగే లాభాలు అమోఘం.. ఈ అద్భుతమైన ప్రక్రియ సర్వ సంపూర్ణమైనది. ఇందుకు మీకు కావలసిందల్లా 6 అడుగుల పొడుగు, 6 అడుగుల వెడల్పు గల చోటు ; మీ శరీరంతోనే చేసేదంతా. కాబట్టి మీరు ఈ అభ్యాసాన్ని ఎక్కడైనా చేసుకోవచ్చు.

శరీర దారుధ్యానికి వెయిట్ ట్రైనింగ్ (వైఘ్త్ త్రైనింగ్) వల్ల శరీరం ఎంత సమర్ధవంతమైనదో, అంగమర్దన కూడా అంతే సమర్ధవంతమైనది. అంతే కాకుండా మీ మనసు మీద ఎలాంటి అనవసరమైన ఒత్తిడీ ఉండదు.

మీరు అంగమర్దనని ఒక వ్యాయామంగానే చూసినా, అంగమర్ధన ఆ పరిక్షకు నిలబడుతుంది. . కండరాలు బలపరచటం, కొవ్వును కరిగించటం అన్నవి కొసరు లాభాలే. మీరు ఏ చేస్తున్న సాధన గురించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే – అది అంగమర్దన కానివ్వండి, మరేదైనా కానివ్వండి, మనము చేసే ప్రయత్నం ఏమిటంటే, శక్తి వ్యవస్థని ఓ నిర్దిష్ట స్థాయికి సమగ్రతకు పెంపొందించడమే. ఇక్కడ మన ఉద్దేశ్యం, మీ శరీర వ్యవస్థను సంపూర్ణంగా పని చేసేస్థితికి చేర్చడం, ఎందుకంటే అది సంపూర్ణంగా పని చేస్తునట్లైతేనే, ఉన్నతమైన అవగాహన స్థాయికి తీసుకువెళ్ళగలం . అరకొరగా సగం సగంగా ఉన్న -శరీరాన్ని కానీ జీవాన్ని కాని పూర్తి స్థాయి అవగాహన పొందే స్థితికి చేర్చలేము.

అంగమర్దన అన్న శబ్దానికి అర్ధం మీ శరీరావయవాల మీద మీకు సంపూర్ణ ఆధిపత్యం. మీరు ఈ ప్రపంచంలో ఏ పని చేయదలుచుకున్నా అది ఎంత బాగా చేయ్యగలరన్నది మీకు మీ శరీరావయవాల మీద ఉన్న ఆధిపత్యం నిర్ణయిస్తుంది. ఏదైనా పని అంటే క్రీడలలో పాల్గొనటం లాంటి వాటిని గురించి చెప్పటం లేదు. బతుకు తెరువు కోసం చేసే పనులు ఇంకా ముక్తి కోసం చేసే పనులు మధ్య తేడాను చూపిస్తున్నాను. మీరు మీ ముక్తి కోసం కానీ లేక మీ చుట్టుపట్ల ఉన్న వారి ముక్తి గురించి కానీ ఏమైనా చెయ్యదలుచుకుంటే మీకు మీ అవయవాల మీద కొంతైనా ఆధిపత్యం ఉండాలి. అవయవాల మీద ఆధిపత్యం అంటే మీరు కండలు తిరిగిన పహిల్వానులా ఉండాలనో లేక పర్వతాన్ని ఎక్కగలరనో కాదు. అలాంటివి కూడా జరగవచ్చు, – కానీ ప్రాధమికంగా, మీ శక్తి శరీర వ్యవస్థ ధృఢ పరచడం కోసం ఇది.

ఉదాహరణకి ఒకవ్యక్తీ అలా నడుచుకుంటూ వెళ్తే, అతని శరీరం బాగా కసరత్ చేసిన శరీరమా లేదా అన్నది ఆ వ్యక్తి నడిచే తీరుని చూస్తే చెప్పేయగలరు. అలాగే ఒక మనిషి మొహం చూస్తే అతని మెదడు పదునైనదా కాదా అని తెలుసుకోగలరు. అలాగే మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఒక వ్యక్తి శక్తి శరీరం ధృఢముగా ఉందొ లేదో స్పష్టంగా తెలుసుకోగలరు. అతను ఏమి చెయ్యగలడు లేక చెయ్యలేడు అన్నది దీని మీద ఆధారపడి ఉంటుంది. పూర్తి ఆధిపత్యం అంటే మీ శక్తిని ఉప్పొంగేలా చేయగలరు. మీరు ఊరికే అలా కూర్చుంటే చాలు మీ శరీరం కావలసిన పనులు చేసేస్తుంది – మీరు లేచి వెళ్ళి ఏమీ పని చెయ్యక్కరలేదు.

మీరు అనుగ్రహానికి పాత్రులు కావాలంటే మీకు అందుకు అనువైన దేహం ఉండాలి. మీకు అందుకు అనువైన దేహం లేకపోతే అపారమైన అనుగ్రహం మీ మీద కురిసినప్పుడు మీరు మొద్దు బారిపోతారు (ఫుసె ఔత్). చాలా మందికి గొప్ప అనుభవాలు కావాలి – కానీ ఆ అనుభూతిని అందుకోగాలిగేలా శరీరాన్ని వారు మలచుకోలేదు. యోగాలో అనుభవాల కోసం తాపత్రయపడరు – మీకు సంసిధం అవుతారంతే. మీ ఆధ్యాత్మిక ప్రక్రియ వట్టి మాటలే కాకూడదనుకుంటే మీకు మీ అవయవాల మీద కొంతైనా ఆధిపత్యం ఉండాలి. 

మరిన్ని శీర్షికలు
mohanaragam  book review