Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Ashok Galla  heroine

ఈ సంచికలో >> సినిమా >>

మెగా టైటిల్స్‌పై కన్నేసిన తమిళ కుర్రహీరో.!

mega titles

ఇటీవల మెగాస్టార్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'ఖైదీ' టైటిల్‌ని తన సినిమా టైటిల్‌గా పెట్టుకుని ప్రేక్షకుల ముందుకొచ్చిన తమిళ హీరో కార్తి, ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. గ్లామర్‌ లేకుండా, హీరోయిన్‌ లేకుండా చేసిన ఈ సినిమా అటెంప్ట్‌తో కార్తికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. స్ట్రెయిట్‌ తెలుగు సినిమా మాదిరి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది కార్తీ 'ఖైదీ'. ఇంకా 'ఖైదీ' మేనియా తగ్గకుండానే, మరో సినిమానీ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడీ యంగ్‌ హీరో. తమిళంలో 'తంబి' అనే టైటిల్‌తో రూపొందిన సినిమాని తెలుగులో 'తమ్ముడు' అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు.

'తమ్ముడు' అనే టైటిల్‌ అందరికీ బాగా పరిచయం. మెగాస్టార్‌ తమ్ముడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ టైటిల్‌ అది. అదే టైటిల్‌ని తన సినిమాకి పెట్టుకుని మరోసారి హిట్‌ కొట్టేద్దామనుకుంటున్నాడు కార్తి. ఈ టైటిల్‌కి మంచి రెస్పాన్సే వస్తోంది. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌, కార్తికి రియల్‌ లైఫ్‌ వదిన అయిన జ్యోతిక, కార్తికి అక్క పాత్రలో నటిస్తోంది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిస్మస్‌కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ క్రిస్మస్‌ బరిలో ఉన్న బాలయ్య 'రూలర్‌', తేజు 'ప్రతిరోజూ పండగే' సినిమాలకు గట్టి పోటీగా ఈ తమిళ 'తమ్ముడు' బరిలోకి దిగుతున్నాడన్న మాట.

మరిన్ని సినిమా కబుర్లు
Hero Madhavan as father of Mega Prince!