Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mass raja

ఈ సంచికలో >> సినిమా >>

హాలీవుడ్‌ రేంజ్‌ 'యాక్షన్‌' హీరోయిన్‌ తమన్నా.!

tamanna heroine

హాలీవుడ్‌లో హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కానీ, మన టాలీవుడ్‌ హీరోయిన్‌ పాత్రల్లో అంత స్ట్రాంగ్‌నెస్‌ కనిపించదు. కానీ, ఇటీవల వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో తమన్నా పాత్రను చాలా స్ట్రాంగ్‌గా డిజైన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర తమన్నాకి చాలా చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది కూడా. సినిమా విడుదలయ్యాకా, చిరంజీవి పాత్ర తర్వాత అంత ఎక్కువగా తమన్నా పాత్ర గురించే మాట్లాడుకున్నారు. ఇప్పుడు అలాంటి పాత్రలోనే మరోసారి మెప్పించింది తమన్నా 'యాక్షన్‌' సినిమాతో. విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా యాక్షన్‌ గాళ్‌గా కనిపించి సూపర్‌ అనిపించుకుంది. హాలీవుడ్‌ రేంజ్‌ విజువలైజేషన్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా పాత్రను చాలా స్ట్రాంగ్‌గా డిజైన్‌ చేశారు డైరెక్టర్‌. ఇలాంటి పాత్రలు మన హీరోయిన్స్‌కి అరుదుగా వస్తాయని, ఇలాంటి పాత్రలు తనకు దక్కినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నానని తమన్నా చెప్పుకొచ్చింది.

అంతేకాదు, ఇలాంటి జోనర్‌లో మరిన్ని అవకాశాలు తనకు దక్కాలని ఆశిస్తున్నానని కోరుకుంటోంది. 'సైరా' తర్వాత నిజానికి తమన్నా రేంజ్‌ చాలా మారిపోయింది. కమర్షియల్‌ రోల్స్‌ కన్నా, విలక్షణ పాత్రలకే ఎక్కువ స్పేస్‌ ఇవ్వాలనుకుంటోందట. సో ఆ దిశగా భవిష్యత్తులో తమన్నాకి మరిన్ని మంచి ఆఫర్స్‌ దక్కాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam