Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు –అందరికీ వందనాలు - భమిడిపాటి ఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈవారం  ( 6/12—12/12 )  మహానుభావులు.

జయంతులు

డిశంబర్ 6

శ్రీమతి సావిత్రి    :  శ్రీమతి నిశ్శంకర సావిత్రి. తెలుగు చలనచిత్ర మహానటి. వీరు డిశంబర్ 6, 1936 న గుంటూరు జిల్లాలోని  చిర్రావూరు లో జన్మించారు.  చిన్న పాత్రల్లో ప్రస్థానం ప్రారంభించి, అగ్రశ్రేణి తారగా ఎదిగారు.  ముందు కొన్ని చిత్రాలలో నటించినా, “ మిస్సమ్మ “ చిత్రంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. 80 కి పైగా చిత్రాలలో నటించారు.

డిశంబర్ 8

శ్రీ చలసాని ప్రసాద్ :  వీరు డిశంబర్ 8, 1932 న నాదెళ్ళవారి పాలెం లో జన్మించారు.  ప్రముఖ కవి,రచయిత మరియు విమర్శకులు. ఆయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు .. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు జైలుకు వెళ్లారు.. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది.

డిశంబర్ 10

శ్రీ రావిచెట్టు రంగారావు : వీరు డిశంబర్ 10, 1877 న దండం పల్లి లో జన్మించారు. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు. శ్రీకొమర్రాజు లక్ష్మణరావుతో కలసి శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం, పిమ్మట విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ని స్థాపించారు. సంస్కృత భాషపై ఎనేలేని గౌరవమున్నవారు. అందుకే ఆయన ఒక సంస్కృత గ్రంథాలయాన్ని స్థాపించి , దాని అభివృధ్ధికి ఎంతో పాటుపడ్డారు.

శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి :   వీరు డిశంబర్ 10, 1880 న కట్టమంచి లో జన్మించారు. ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించారు., సాహిత్యరంగంలో సరికొత్త భావాలకు, నూతన ఆలోచనా రీతులకు మనోవికాసాత్మకమైన విమర్శలకు కట్టమంచి దోహదపడ్డారు.. ఒకవైపు తెలుగు కవితను మరో వైపు కవితా విమర్శను నూతన శోభతో కొత్తకాంతులతో ఆవిష్కరించిన సాహితీమూర్తి .

డిశంబర్ 11

శ్రీ సత్తిరాజు సీతారామయ్య :  వీరు డిశంబర్ 11, 1864 న  కంతేరు లో జన్మించారు.  ప్రముఖ పాత్రికేయుడు, రచయిత.  “దేశోపకారి”, , ( వారపత్రిక), “ హిందూ సుందరి “ అనే మాసపత్రికనూ ప్రారంభించారు. … వీరు అనేక గ్రంధాలను కూడా రచించారు.

వర్ధంతులు

డిశంబర్ 8

శ్రీ నేదునూరి కృష్ణమూర్తి :  ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు.  సంగీత కళానిధి పద్మభూషణ్‌ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి గారి వద్ద చేసి సంగీతంలో గమకాలు, ఇతర మెళకువలలో శిక్షణ పొంది, సంగీత నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. ఆల్‌ ఇండియా రేడియోలో అగ్రగణ్య కళాకారుడిగా వెలుగులోకి వచ్చారు. 1951 నుండి ఐదు దశాబ్దాలకు పైగా మద్రాసు సంగీత అకాడమీలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టారు. సంగీత లోకంలో ప్రముఖ స్థానం సంపాయించుకున్నారు. సంగీత అకాడమీలో యాబై యేళ్ళకు పైగా పాడారు. నేదునూరి కృష్ణమూర్తి స్వర పరచిన కీర్తనలలో - దాశరథి శతకం పద్యాలు, రాగ సుధా రసాలతో భద్రాచల రామదాస కీర్తనలు ప్రసిధ్ధమైనవి. రెండు సీడీలు వెలువరించారు. అన్నమాచార్య సంకీర్తనలు, పదకదంబం మీద పలు సీ డీలు, కెసెట్లు విలువడించారు. ఆల్‌ ఇండియా రేడియో భక్తి రంజనిలో కూర్చిన నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు బగా వాసికెక్కాయి.

వీరు డిశంబర్ 8, 2014 న స్వర్గస్థులయారు.

డిశంబర్ 10

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి :  లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. అనేక గ్రామాలలో భాగవతం, హరి వంశం, పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరేవారు. పరమ నిష్టాగరిష్టంగా జీవించేవారు. ప్రాణాయామం తపస్సు కొనసాగించారు శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశమైనాయి. వాటిని స్వంతానికి ఎప్పుడూ వాడుకోలేదు. వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు.

డిశంబర్ 10, 1996 న  ఈ పుణ్యమూర్తి స్వర్గస్థులయారు.. వీరి పార్ధివ శరీరానికి అగ్ని సంస్కారం చేస్తూన్నప్పుడు మంటల్లో బాలత్రిపుర సుందరి దర్శనమిచ్చినట్టు కనిపించిందిట…

డిశంబర్ 12

శ్రీ పెమ్మరాజు  రామారావు :  ప్రముఖ రంగస్థల నటుడు. తెలుగు నాటకాలే కాకుండా ఇంగ్లీషులో ఒథెల్లో, మాక్‌బెత్ వంటి నాటకాలలో కూడా ఆయన ప్రతిభను ప్రదర్శించాడు. ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించారు. వీరు డిశంబర్ 12, 1971 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
naneelu