Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

క్యూట్ మీనా....సూపర్ స్టార్..ఈసారెలాగంటే.....

cute meena

సూపర్ స్టార్ రజనీ క్యూట్ మీనాతో కలిసి " థిల్లానా....థిల్లానా...నా కసికళ్ళకూనా " అంటూ ఆడి పాడి ప్రేక్షకులను ఊపేసిన పాట గుర్తుందా? ముత్తు సినిమాలోని ఈ పాట అప్పట్లో సూపర్ హిట్టు.... వీళ్ళిద్దరి జంట బంపర్ హిట్టు....అలాగే వీరా, యజమాన్ సినిమాల్లోనూ రజనీ తో కలిసి స్టెప్పులేసింది మీనా....

పెళ్ళయి పిల్లలు పుట్టి కొంతకాలం సినిమాలకు దూరమయ్యాక తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది మీనా....అప్పట్లో తాను కలిసి నటించిన హీరోలతోనే రెండో దశలోనూ చిత్రాల్ని చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది...సుందర కాండ, చంటి, తదితర చిత్రాల్లో వెంకటేశ్ తో కలిసి నటించిన మీనా, లేటెస్టుగా దృశ్యంలో వెంకటేశ్ తో జతకట్టి ఆకట్టుకుంది. ఇప్పటి వయసుకు తగ్గట్టు మరింత క్యూట్ గా కనిపించి మంచి మార్కులే కొట్టేస్తోంది....అలాగే సూపర్ స్టార్ రజనీతో కలిసి మరోసారి నటించబోతోందట...అయితే హీరోయిన్ గా మాత్రం కాదండోయ్....విలన్ గా.....నిజమే....అసలే సూపర్ స్టార్ ...ఆయనకు విలనంటే ఎంత పవర్ ఫుల్ అయ్యుండాలి అని ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉంటాయి...ఓ పెద్ద డానో, అంతర్జాతీయ తీవ్రవాదో, లేదా వేల ఎకరాల భూములూ, ఆస్తులూ కలిగిన భూస్వామో....అంత స్థాయి అయినా ఉండొచ్చని అనుకుంటారంతా...మరి ఈ ముద్దుగుమ్మ విలనా అని ఆశ్చర్యపోతున్నారంతా....ఈ విభిన్నమైన కాంబినేషన్ మూవీలో రజనీకి జోడీగా ఖుష్బూ నటించనుందట...సన్ పిక్చర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించబోతున్నాడట..మీనా ఈ కొత్త లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిద్దాం....

మరిన్ని సినిమా కబుర్లు
churaka