Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

వెంకీ మామ చిత్రసమీక్ష

venky mama movie review

చిత్రం: వెంకీ మామ
నటీనటులు: విక్టరీ వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌, రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌, నాజర్‌, గీత, విద్యుల్లేఖ రామన్‌, దాసరి అరుణ్‌కుమార్‌, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్ర తదితరులు
సంగీతం: తమన్‌ ఎస్‌ఎస్‌
సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మురెళ్ళ
నిర్మాణం: సురేష్‌ ప్రొడక్షన్స్‌ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: సురేష్‌ బాబు, టిజి విశ్వ ప్రసాద్‌
దర్శకత్వం: బాబీ (కెఎస్‌ రవీంద్ర)
విడుదల తేదీ: 13 డిసెంబర్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

మిలిటరీ నాయుడు అలియాస్‌ వెంకటరత్నం నాయుడు (వెంకటేష్‌)కి ఓ మేనల్లుడుంటాడు. అతనే కార్తీక్‌ (నాగచైతన్య). మేనల్లుడంటే మేనమామకీ, మేనమామ అంటే మేనల్లుడికీ బోల్డంత అభిమానం, ప్రేమ, గౌరవం. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన కార్తీక్‌కి అన్నీ తానే అయి పెంచుతాడు వెంకటరత్నం నాయుడు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మేనమామకి దూరమవుతాడు మేనల్లుడు. తన మేనల్లుడు మిలిటరీలో చేరాడని తెలుసుకుంటాడు వెంకటరత్నం. ఇంతకీ, కార్తీక్‌ ఎందుకు మిలిటరీలో చేరాడు? ఇద్దరి మధ్యా తలెత్తిన విభేదాలేమిటి.? ఆ విభేదాలు ఎలా పరిష్కారమయ్యాయి.? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే..

వెంకటేష్‌ పేరు చెప్పగానే ఆన్‌ స్క్రీన్‌ బోల్డంత ఎనర్జీ గుర్తుకొస్తుంది. ఎంటర్‌టైనింగ్‌ సన్నివేశాల్లో వెంకీ చెలిరేగిపోవడం కొత్తేమీ కాదు. ఎమోషనల్‌ సీన్స్‌లో వెంకీ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్నీ సమపాళ్ళలో వున్న క్యారెక్టర్‌ దొరకడంతో వెంకీ దుమ్ము రేపేశాడు. తెరపై వెంకటేష్‌ కన్పిస్తున్నంతసేపూ బోల్డంత సందడి నెలకొంటుంది.

ఇక, కార్తీక్‌ పాత్రలో ఒదిగిపోయాడు నాగచైతన్య. భిన్న పార్శ్వాలున్న పాత్రలో చాలా బాగా చేశాడు నాగచైతన్య. వెంకీతో కలిసి నటించే సన్నివేశాల్లో వుండాల్సిన ఎనర్జీకి తగ్గట్లుగా నాగచైతన్య మెప్పిస్తాడు.

హీరోయిన్లలో రాశి ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌.. ఇద్దరికీ సమానంగా స్క్రీన్‌ స్పేస్‌ దక్కింది. ఇద్దరూ తమ అంద చందాలతో ఆకట్టుకున్నారు. నటన పరంగానూ ఇద్దరూ తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. ప్రకాష్‌రాజ్‌ తన అనుభవాన్ని రంగరిస్తే, ఎమ్మెల్యే పాత్రలో ఒదిగిపోయారు రావు రమేష్‌. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర మెప్పిస్తారు.

కథ పరంగా మరీ అంత కొత్తదనం ఏమీ కన్పించదు. కథనం ఓకే. డైలాగ్స్‌ బావున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగానే వున్నాయి. ఆర్ట్‌ అండ్‌ కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాకి తగ్గట్లుగా తమ ఔట్‌పుట్‌ ఇచ్చాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్‌ కన్పించింది. అయితే, మిలిటరీ ఎపిసోడ్‌ సన్నివేశాల్లో 'ఇంకాస్త బెటర్‌గా తీసి వుంటే బావుండేది' అన్పిస్తుంది. తెరపై వెంకటేష్‌ ఫుల్‌ జోష్‌తో కన్పిస్తే ఆ కిక్కే వేరు. ఫుల్‌ ఆఫ్‌ ఎనర్జీతో ఫస్టాఫ్‌ని డిజైన్‌ చేసిన దర్శకుడు, వెంకటేష్‌లోని జోష్‌ని ఫుల్‌గా వాడేసుకున్నాడు. దాంతో సినిమా చాలా జోరుగా సాగిపోతుంది. వెంకటేష్‌ - నాగ చైతన్యల మధ్య రీల్‌ లైఫ్‌ అనుబంధం ప్రేక్షకులకు రియల్‌ లైఫ్‌ అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. హీరోయిన్ల గ్లామర్‌ అదనపు అడ్వాంటేజ్‌. అయితే, సెకెండాఫ్‌లో ఎప్పుడైతే మిలిటరీ ఎపిసోడ్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువవుతాయో సినిమాలో వేగం తగ్గుతుంది. రావు రమేష్‌ విలనిజం పెద్దగా ఆకట్టుకోకపోవడం సినిమాకి మైనస్‌ పాయింట్‌. సెకెండాఫ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టి, మరింత ఎంటర్‌టైనింగ్‌గా మలచి వుంటే, సినిమా రిజల్ట్‌ ఇంకో లెవల్‌లో వుండేది.

ఒక్క మాటలో చెప్పాలంటే.
వెంకీ మామా - ఫర్వాలేదు మామా!

అంకెల్లో చెప్పాలంటే..
2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
Bollywood Calling For Beauty'!