Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anubandhalu telugu serial thirtieth Part

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

స్పెయిన్ లోని మాడ్రిడ్ కి చెందిన పెడ్రో కర్డోనా అనే దొంగగారు ఎవరూలేని ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని తను పెంచుకునే కుక్కగారు లోపలకి వచ్చి వెళ్ళడానికి అనువుగా తలుపుకింద ఏర్పాటు చేసుకున్న చిన్న 'డాగీ డోర్' ద్వారా లోపలకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అయితే నడుం దాకా వెళ్ళాక ఆ కంతలో దొంగగారు ఇరుక్కుపోయి కేకలు పెట్టాడు. పోలీసులు గొడ్డలితో ఆ తలుపు పగలకొడితే కాని అతను బయటకి రాలేకపోయాడు.



హ్యూస్టన్ కి చెందిన బర్ట్ అనే దొంగ ఓ బేంక్ లోకి చొరబడి, కత్తి చూపించి కేషియర్ నించి డబ్బు దోచుకున్నాడు. అయితే అతను పొరపాటున ఆ మడత కత్తిని మడవకుండా కోటు జేబులో పెట్టుకోగానే అది పొత్తి కడుపులో పొడుచుకుంది. స్పృహలో లేని అతన్ని పోలీసులు వచ్చి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు.

 

మరిన్ని సీరియల్స్