Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
we want hit

ఈ సంచికలో >> సినిమా >>

రావు రమేష్‌ కూడానా?

rao ramesh

సినిమా సెలబ్రిటీలంటే సినీ అభిమానుల్లో చాలా క్రేజ్‌ వుంటుంది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లకే కాదు, దర్శకులకు, కమెడియన్లకూ అభిమానులుంటారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులూ ప్రేక్షకుల మదిలో తమకూ చోటు దక్కించుకుంటారు తమ అభినయ కౌశలంతో. అలా తనకంటూ తెలుగులో ఓ ప్రత్యేకత సంపాదించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రావు రమేష్‌, వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. స్వర్గీయ రావు గోపాలరావు తనయుడైన రావు రమేష్‌ సినిమాలతోపాటు కొన్ని అడ్వర్‌టైజ్‌మెంట్లలోనూ కనిపిస్తున్నాడు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి శుభగృహ ప్రకటనలో కనిపిస్తుండగా, కె.విశ్వనాథ్‌ పంచ తులసి ప్రకటనలో కనిపిస్తున్నారు. రావు రమేష్‌, నంద్యాల నంది పైపుల ప్రచారకర్తగా మారారు. ఎక్కువగా కాలేజీ లెక్చరర్‌ పాత్రల్లో నటిస్తున్న ఆయన నంద్యాల పైపుల ప్రకటనలోనూ టీచర్‌ తరహాలో దర్శనమిస్తున్నారు.

ఇలాంటి ప్రకటనల్లో నటిస్తుండడం వల్ల నటీనటులకు బాగానే గిట్టబాటవుతోంది. సినిమా రెమ్యునరేషన్లకు ధీటుగానూ కొన్ని ప్రకటనలకు ఆయా సంస్థలు చెల్లించుకుంటున్నాయి. సినీ రంగంలో వారు సాధించిన విజయాలు, వారికి వున్న పాపులారిటీ నేపథ్యంలో ప్రకటనల్లో నటించడానికి ఎంపిక చేస్తున్నాయి వివిధ సంస్థలు.

మరిన్ని సినిమా కబుర్లు
producer nara rohit