Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rao ramesh

ఈ సంచికలో >> సినిమా >>

నారా రోహిత్‌ నిర్మాతగా

producer nara rohit

ఓ పది పాతిక సినిమాల్లో నటిస్తే తప్ప, సినిమా గురించి పూర్తి అవగాహన వచ్చేది కాదు ఒకప్పటి రోజుల్లో. కానీ ఇప్పుడు తొలి సినిమాతోనే సినిమాని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సినిమా పరిశ్రమపై అవగాహన పెంచుకునే నటనా రంగంలోకి అయినా, దర్శకత్వ విభాగంలోకి అయినా వస్తున్నారు. అందుకనే ఓ సినిమా చేశాక, పరిస్థితుల్ని బట్టి నిర్మాతగా మారడానికీ నటులు ముందుకొస్తున్నారు.

నారా రోహిత్‌ కూడా అంతే. ఓ సినిమాకి నారా రోహిత్‌ నిర్మాతగా మారబోతున్నాడు. ‘మారియో’ అనే సినిమాని రూపొందించబోతున్నాడు. ఇందులో శ్రీవిష్ణు హీరోగా నటించబోతున్నాడు. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘ప్రతినిథి’, ‘సెకెండ్‌ హ్యాండ్‌’ సినిమాల్లో నటించాడితడు. ఈ మూడూ విడుదలకు సిద్ధమయ్యాయి.

నారా రోహిత్‌ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్‌పై వున్నాయి. ‘ప్రతినిథి’ విడుదలకు సిద్ధమైంది. ‘మదరాసి’ ప్రారంభమైంది. ఇంకో సినిమా ‘రౌడీ ఫెలో’ నిర్మాణంలో వుంది. నిర్మాతగా ‘మారియో’ సినిమాతో నారా రోహిత్‌ సక్సెస్‌ అవుతాడని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
threat in mumbai