Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
threat in mumbai

ఈ సంచికలో >> సినిమా >>

గోగులకి మళ్ళీ ఆ రోజులు

happy days in ramana gogula

పవన్‌కళ్యాణ్‌తో పలు మ్యూజికల్‌ హిట్స్‌ ఇచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల, ఈ మధ్య వరుసగా ఫెయిల్యూర్స్‌ చవిచూస్తున్నాడు. అతని మ్యూజిక్‌లో పస తగ్గిందనీ, మునుపటి జోరు అతని కెరీర్‌లో కనిపించడం కష్టమనీ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ టైమ్‌లోనే రమణ గోగుల, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మళ్ళీ హిట్‌ కొట్టాడు.

రమణ గోగుల మ్యూజిక్‌ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విషయంలో మిగతా మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో పోల్చితే రమణ గోగులది భిన్నమైన శైలి. అందుకే అతని మ్యూజిక్‌లో ఏదో మ్యాజిక్‌ వుంటుందని ఎక్కువమంది అతన్ని అభిమానిస్తారు.

సక్సెస్‌ వస్తేనే కదా సినీ రంగంలో ఎవరికైనా గుర్తింపు పెరిగేది, రమణ గోగుల కూడా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సక్సెస్‌తో మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ అయ్యాడు. అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కట్టే రోజులు రాబోతున్నాయి. ఇంకో హిట్‌ రమణ గోగుల తనదైన స్టైల్‌లో ఇస్తే, రమణ గోగులకి మునుపటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రోజులొచ్చేస్తాయని చెప్పడం నిస్సందేహం.

మరిన్ని సినిమా కబుర్లు
meet in mahesh