Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
happy days in ramana gogula

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌బాబుని కలవాలంటే

meet in mahesh

హీరో మహేష్‌బాబు, సుకుమార్‌ డైరెక్షన్‌లో నటించిన ‘1’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మహేష్‌ అంటే యువతలో పిచ్చ క్రేజ్‌ వుంది. చిన్నపిల్లల్లోనూ అతనికి పెద్దసంఖ్యలో అభిమానులున్నారు. అందుకనే ఓ వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు.

స్కూళ్ళలో విద్యార్థుల నుంచి జిల్లా స్థాయి వరకూ పోటీలు నిర్వహించి, ఒక్కో జిల్లా నుంచి ఒక్కొక్కర్ని ఎంపిక చేస్తారు. వారిని ‘1’ ఆడియో విడుదల వేడుకకి ఆహ్వానిస్తారు. ఆడియో విడుదల వేడుకలో మహేష్‌ చేతుల మీదుగా ఆ ‘నెంబర్‌ 1’ లకు బహుమతుల్ని అందజేస్తారు.

ఇప్పటికే 400 స్కూల్స్‌ వరకూ ఈ కాంటెస్ట్‌ కోసం బరిలోకి దిగాయి. ఇంకెవరైనాసరే.. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలకుంటే సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌, వంశీ '9642344669'. ఇంకేం మహేష్‌బాబుని కలవడానికి చిన్నారులకి ఇదే మంచి అవకాశం.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam