Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mohanbabu with sarkar

ఈ సంచికలో >> సినిమా >>

ఆ దర్శకుడు దారి చూపిస్తాడా?

the director become to set a way

‘తడాఖా’తో హిట్టు కొట్టినా నాగచైతన్య వరుస ఫ్లాపుల్లోనే వున్నాడనేంతలా, అతని కెరీర్‌ డల్‌ అయిపోయింది. కారణం ‘ఆటోనగర్‌ సూర్య’ ఇంకా విడుదల కాకపోవడమే. ఎప్పుడో రెడీ అయిపోయిన ‘ఆటోనగర్‌ సూర్య’ అనేక కారణాలతో విడుదల వాయిదా పడింది. నిర్మాణమూ ఆలస్యంగానే జరిగింది లెండి.

అదలా వుంచితే, నాగచైతన్య కెరీర్‌ స్పీడందుకునేలా అతను సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో హిట్‌ కొట్టిన దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌, నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు. నాగచైతన్య, కొండాపై పూర్తి భరోసాతో వున్నాడు. ఈ సినిమా ప్రారంభమైంది కూడా. వరుస ఫ్లాపులతో వున్న నితిన్‌, ‘ఇష్క్‌’ సినిమాతో హిట్‌ కొట్టగా, ఇంకా పెద్ద హిట్‌ నితిన్‌కి ఇచ్చాడు కొండా విజయ్‌కుమార్‌. అదే సెంటిమెంట్‌ నాగచైతన్యకూ వర్కవుట్‌ అయితే, అతని కెరీర్‌ గాడిన పడ్డట్టే. కొండా, నాగచైతన్యకి హిట్‌ దారి చూపిస్తాడేమో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
this story of 'yevadu'