Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with anoop rubens

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - సెకండ్ హాండ్

Movie Review - Second Hand

చిత్రం: సెకెండ్‌ హ్యాండ్‌
తారాగణం : శ్రీ విష్ణు, సుధీర్‌ వర్మ, కిరీటి, ధన్య బాలకృష్ణ, పోసాని కృష్ణమురళి, కిషోర్‌ తిరుమల, అనుజ్‌ రామ్‌ తదితరులు
ఛాయాగ్రహణం: అవనీంద్ర
సంగీతం: రవి చంద్ర
నిర్మాణం: శ్రీ శ్రేయాస్‌ చిత్ర
నిర్మాతలు: బీవీఎస్‌ రవి, పూర్ణ నాయుడు
దర్శకత్వం: కిషోర్‌ తిరుమల
విడుదల తేదీ: 13 డిసెంబర్‌ 2013

క్లుప్తంగా చెప్పాలంటే :
ప్రియురాలు దీపు (ధన్య) చేతిలో మోసపోయిన సంతోష్‌ (సుధీర్‌) ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో సుబ్బారావు (కిరీటి)ని కలుస్తాడతడు. సుబ్బారావు ఓ అమ్మాయిని (ఈమె కూడా ధన్యనే) పెళ్ళాడతాడు. అయితే ఆమె వేరొకరితో ప్రేమలో పడ్తుంది. కథ అలా నడుస్తుండగా, ఇంకో అమ్మాయి సహస్ర (ఈమె కూడా ధన్యనే) సంతోష్‌, సుబ్బారావుల కథలోకి వస్తుంది. ఆమె వీరిద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలోనన్న కన్‌ఫ్యూజన్‌లో వుంటుంది. ఎవరు ఎవర్ని పెళ్ళాడారు.? సహస్ర కన్‌ఫ్యూజన్‌ తీరిందా.? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే:
సుధీర్‌ వర్మ నటన పరంగా మంచి మార్కులేయించుకున్నాడు. తన పాత్రకు తగిన న్యాయం చేశాడు. కిరీటి సరదా సరదా పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీవిష్ణు తన పాత్రలో రాణించాడు. ధన్యా బాలకృష్ణ సహజమైన అందంతో కన్పించింది. నటన పరంగానూ ఆకట్టుకుంటుంది. పోసాని ఓకే, తనదైన మేనరిజం ప్రదర్శించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, తమ పాత్రల వరకు ఫర్వాలేదన్పించారు. సంగీతం బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టుగానే వుంది. రెండు పాటలు బాగా ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా అన్పిస్తుంది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌కి ఇంకా పని చెప్పి వుండాల్సింది. కాస్ట్యూమ్స్‌ని బాగా డిజైన్‌ చేశారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా వర్క్‌ చేసింది. మిగతా విభాగాలన్నీ సినిమాకి అవసరమైనంతగా అన్నీ సమకూర్చడం సినిమాకి కలిసొచ్చింది.ఇంట్రెస్టింగ్‌ స్టోరీ లైన్‌తో దర్శకుడు సినిమాని తెరకెక్కించాడు. ప్రెజెంటేషన్‌ రిచ్‌గా వుంది. కథ చెప్పిన విధానం బావుంది. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. మంచి స్క్రిప్ట్‌కి, మంచి స్క్రీన్‌ప్లే కుదిరింది. అన్ని విభాగాల నుంచీ దర్శకుడు తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో సఫలమయ్యాడు. నటీనటులు, టెక్నీషియన్లు.. అందర్నీ దర్శకుడు బాగా వాడుకోవడంతోపాటు, తాను చేయాల్సింది కూడా పక్కాగా చేయగలిగాడు. దాంతో మంచి ఔట్‌ పుట్‌ వచ్చిందని చెప్పక తప్పదు.

రొటీన్‌ కమర్షియల్‌ అంశాలతో కొన్ని సినిమాలు వస్తున్నాయి. భారీ సినిమాలు, చిన్న సినిమాలూ కమర్షియల్‌ ఫార్మాట్‌లో రావడం సహజమే. అయితే కొందరు దర్శకులు, అందునా కొత్త దర్శకులు కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు. అలా కొత్త తరహా సినిమాలు తెలుగు తెరపై వస్తున్నాయి. కొన్ని ఫెయిల్యూర్స్‌ తప్పడంలేదు. అయితే చెప్పాలనుకున్న విషయానికి అవసరమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడిస్తే, మంచి నటీనటుల్ని ఎంపిక చేసుకుంటే, టెక్నీషియన్స్‌ని సరైనవారిని తీసుకుంటే మంచి విజయం సాధించవచ్చని కొందరు దర్శకులు నిరూపించారు. ఆ కోవలోకే ఈ చిత్రం కూడా వస్తుంది. ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో సీరియస్‌నెస్‌ కొంచెం కన్పించినా, సినిమాలో ప్రేక్షకుల్ని లీనమైపోయేలా చేయగలిగాడు దర్శకుడు. దాంతో మంచి సినిమా చూశామన్న భావన కలుగుతుంది థియేటర్‌ నుంచి బయటకొచ్చేటప్పుడు. సినిమా ప్రమోషన్‌ బాగా చేయగలిగితే, మంచి బిజినెస్‌ చేసే అవకాశం వుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే: యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌..

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu