Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
this story of 'yevadu'

ఈ సంచికలో >> సినిమా >>

దిమ్మ తిరిగే వర్మ ప్రశ్న

mind blowing varma question

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సంచలనాత్మకమైన సినిమా తీయడంలో అయినా, వివాదాలతో సంచలన వార్తల్లోకి ఎక్కడంలో అయినా వర్మ తర్వాతే ఎవరైనా. చాలా విషయాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టినట్లుగా చెబుతాడు వర్మ. అయితే అవి కొన్నిసార్లు వివాదాస్పదమవుతుంటాయి.

‘నేను వివాదాల కోసం మాట్లాడను... నేను ఏం మాట్లాడినా వాటిని వివాదం చేస్తుంటారు... దానికి నేనెలా బాధ్యత వహిస్తాను...’ అంటాడు వర్మ. తాజాగా వర్మ స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ట్విట్టర్‌లో ఓ కామెంట్‌ పోస్ట్‌ చేశాడు. ‘స్వలింగ సంపర్కం నేరం. 377 సెక్షన్‌ కింద. స్వలింగ సంపర్కుల్ని అరెస్టు చేసినట్లే, లింగాన్ని పూజించేవాళ్ళని కూడా లోపలేస్తారా?’ అని వర్మ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

వర్మ అమాయకంగా ప్రశ్నించాడా? లేదంటే అన్నీ తెలిసి తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టాడా? వర్మ సుప్రీంకోర్టుని ప్రశ్నించినట్లా? అనేది అర్థం కావడంలేదు. ‘నన్ను ఎడ్యుకేట్‌ చెయ్యండి’ అని తన ప్రశ్నకు కొనసాగింపుగా అమాయకత్వం ప్రదర్శించాడు వర్మ.

మరిన్ని సినిమా కబుర్లు
baboy! baahubali