Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mind blowing varma question

ఈ సంచికలో >> సినిమా >>

బాబోయ్‌! బాహుబలి యోధుడు

baboy! baahubali

బాహుబలి సినిమాలో ప్రధాన పాత్రధారులంతా కండలు తిరిగిన మొనగాళ్ళే. ప్రభాస్‌, రాణా కండలు తిరిగిన శరీరం కలిగి వున్నవారే. ‘బాహుబలి’ కోసం ఇంకా కండలు పెంచేసి, బీభత్సంగా కనిపించబోతున్నారు. రాణా ఈ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఇదే సినిమా కోసం కండలు తిరిగిన మొనగాళ్ళను రాజమౌళి ఎంపిక చేసుకుంటున్నాడు. ఎందుకంటే సినిమా బ్యాక్‌డ్రాప్‌ అలాంటిది.

తాజాగా ‘బాహుబలి’ కోసం మరో విలన్‌ని రాజమౌళి ఎంచుకున్నాడు. అతనిపేరు చరణ్‌దీప్‌. ఇతగాడిదీ సిక్స్‌ ప్యాకే. ఇతని ఫొటోలు బయటకొచ్చాక, ఏంటీ సినిమాలో ఎంతమంది బాహుబలులు వున్నారు? అనుకోవాల్సి వస్తోంది.

రాజమౌళి ఏం చేసినా పక్కాగా వుంటుంది. హీరోకి సరిజోడీ అయ్యే విలన్‌ వుంటేనే కథలో కిక్‌ వస్తుంది. హీరో, ప్రతినాయకుడు, అతని గ్యాంగ్‌, ఇతర నటీనటులు సినిమాకి సరిపడా వుంటున్నారు. అనుష్క సంగతి సరే సరి. ఆమె ఎలాగూ పొడగరి, దాంతో సినిమా తెరపై అత్యద్భుతంగా కనిపించనుందని ఊహించుకోవచ్చు.

ఒక్కొక్కటిగా సినిమాకి సంబంధించి ఇలాంటి విశేషాలు వెలుగు చూస్తోంటే, ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా? అన్న ఆసక్తి పెరిగిపోతోంది సగటు సినీ ప్రేక్షకుల్లో. ఫ్లాప్‌లంటూ ఎరుగని రాజమౌళి ‘బాహుబలి’ని కూడా అత్యద్భుతమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడనటం నిస్సందేహం.

మరిన్ని సినిమా కబుర్లు
this two movies