Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Telugu Padya Madhurimalu - book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (డిసెంబర్ 13 - డిసెంబర్ 19) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో భోజనసౌఖ్యంను పొందుతారు. చేపట్టిన పనులలో ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. ధనమునకు సంబంధించిన విషయాల్లో రాక సంతృప్తి ఉంటుంది. శరీరసౌఖ్యంనకు ప్రాముఖ్యతను ఇస్తారు. ఆది, సోమ, మంగళవారాల్లో సరైన సమయానికి భోజనం చేయుట మంచిది. పని ఒత్తిడిని కలిగి ఉండే అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనులను చేపట్టుట ఉత్తమం. వాటికి సమయాన్ని ఇవ్వడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో అశ్రద్ద చేయకండి. బుధ, గురువారాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు ఇష్టపడుతారు. మనోదైర్యంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. కొద్దిగా కష్టపడితే పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. వారం మొత్తం మీద ఆరంభంలో చేపట్టిన పనులలో ఆటంకాలు పొందుటకు అవకాశం ఉంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోతే ధనంను నష్టపోయే ఆస్కారం కలదు. వ్యతిరేకవర్గం వారినుండి ఇబ్బందులు పొందుతారు. తోటివారికి సహాయం చేయాలనే ఆలోచనలు చేస్తారు. అందరితో స్పష్టమైన మీ ఆలోచనలు పంచుకోండి లేకపోతే అనవసరపు సమస్యలను తెచ్చుకొనే అవకాశం కలదు.

వృషభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం కలదు. అధికమైన ఆలోచనల మూలాన ఇబ్బందులు పొందుతారు. ధనమునకు సంబంధించిన విషయాల్లో తిప్పలు తప్పకపోవచ్చును. ప్రతిపనిని చేపట్టుటకు ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేయుట ఉత్తమం. ఆది, సోమ, మంగళవారాల్లో ఉత్సాహంను కలిగి ఉండి పనులలో మంచి ఫలితంను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. పెద్దల సూచనలు, సలహాలను పాటించే ప్రయత్నం చేయుట వలన అన్నివిధాల లాభంను పొందుతారు. భోజనసౌఖ్యంను పొందుతారు, నచ్చిన పదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. వారం మొత్తం మీద పనులకు సంబంధించి ఉత్సాహం మొదట్లో ఉన్నంతగా చివరి వరకు ఉండక పోవచ్చును. జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు. నిదానంగా వ్యవహరించుట మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు చేపట్టుట ఉత్తమం. అధికారులతో నిదానంగా వ్యవహరించుట మేలు. ధనమునకు సంబంధించిన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది.

మిథున రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో బంధువులతో సమయాన్ని గడుపుతారు. భోజనమునకు ప్రాముఖ్యతను ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. అధికారులతో కలిసి చేపట్టిన పనులలో మంచి ఫలితాలు కలుగుతాయి. ఆది, సోమ, మంగళవారాల్లో ధనమును నష్టపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండుట మేలు. ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది. వాటిమూలాన ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిబారంను పొందుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. బుధ, గురువారాల్లో భోజనం విషయంలో శ్రద్ద తీసుకోండి సమయానికి భోజనం చేయుట మంచిది. నూతన పనులను చేపట్టుటకు ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుచేస్తుంది. వారం మొత్తం మీద మొదట్లో పనులలో విజయాలను పొందుతారు. ప్రణాళికాబద్దంగా నడుచుకోకపోతే ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంలో అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన సమస్యలు తగ్గుతాయి. వారం చివరలో ఉత్సాహంను కోల్పోకుండా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయండి మంచిది. పనులలో శ్రమను పొందుతారు. చర్చలపట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఇష్టమైన పనులను చేపడుతారు. వాటిని సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. అధికారులకు అనుగుణమైన నిర్ణయం తీసుకోవడం మూలాన మేలు జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభం ఉంటుంది. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. ఆది, సోమ, మంగళవారాల్లో బంధువులతో సమయాన్ని గడుపుతారు. మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి బాగుంటుంది. కాకపోతే పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. తప్పక మేలుజరుగుతుంది. అధికారులతో మంచి సంభందాలను కలిగి ఉండుట మేలు. బుధ, గురువారాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోకపోవడం మంచిది. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. వారం మొత్తం మీద మొదట్లో బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ధనవ్యయం కలుగుతుంది. చివరలో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట చేత పనులలో విజయంను పొందుతారు. ధనమునకు సంబంధించిన విషయాల్లో బాగానే ఉంటుంది చేసిన ప్రయత్నాలు కలిసి వచ్చే ఆస్కారం ఉంది. ఇష్టమైన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.

సింహ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును. వాటి మూలాన ఇబ్బందులు పొందుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు పొందుతారు. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. కలహములకు దూరంగా ఉండు ప్రయత్నం చేయండి. ఆది, సోమ, మంగళవారాల్లో ఉద్యోగంలో తలపెట్టిన పనులలో ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కాకపోతే అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. బందువుల ఎడల ప్రీతిని కలిగి ఉంటారు. వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. బుధ, గురువారాల్లో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ప్రయాణాలు చేస్తారు వాటికి సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. బంధువుల గృహంలో సమయాన్ని గడుపుతారు. వారం మొత్తం మీద కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. అనుకోని విభేదాలు కలుగుట చేత సమస్యలు పెరుగుటకు ఆస్కారం కలదు. చేపట్టిన పనులలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. బందుమిత్రులతో కలిసి చేపట్టు పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి.
 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్ర, శని వారాల్లో ఆరోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. ముఖ్యంగా మోకాళ్ళనొప్పుల మూలాన సమస్యలు పొందుతారు. పనుల్లో ఆటంకాలు కలుగుట వలన బాధను పొందుతారు. మిత్రుల సహకారం సమయానికి అందకపోవచ్చును. ఆది, సోమ, మంగళవారాల్లో కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాల మూలాన ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల మూలాన సమస్యలు కలుగుతాయి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. బుధ, గురువారాల్లో బాగానే ఉంటుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే భాదను పొందుట మంచిది కాదు ఓపిక అవసరం. వారం మొత్తం మీద మొదట్లో పనులలో విజయాన్ని పొందినను చివరకు పనిభారం వలన ఇబ్బందులు పొందుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. మార్గమధ్యలో ఇబ్బందులను పొందుతారు. సంతాన మూలక సౌఖ్యంను పొందుతారు. వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యతిరేక వర్గం వలన ఇబ్బందులు పొందుతారు.

తులా రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. నలుగురిలో చేపట్టిన పనులకు గాను గుర్తింపును పొందుతారు. ఆదాయం బాగానే ఉంటుంది. బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఆది, సోమ, మంగళవారాల్లో స్వల్ప ఆరోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. ప్రయాణాల విషయంలో నిదానం అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు కలుగుతాయి జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో చిక్కులు కలుగుటకు అవకాశం ఉంది. అధికారులతో నిదానంగా వ్యవహరించుట మంచిది. బుధ, గురువారాల్లో కుటుంబంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం, పెద్దల సూచనలు సలహాలను పాటించుట చేత మేలు జరుగుతుంది. నలుగురితో కలిసి పనిచేయడం నేర్చుకోండి మంచిది. వారం మొత్తం మీద స్నేహితుల మూలాన కొత్త కొత్త సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. కావున మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టునపుడు తగిన విధంగా మెలగండి. ధనమునకు సంబంధించిన విషయాల్లో నష్టం పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట మంచిది. పెద్దల సహకారంను పొందినచో విజయాలను సొంతం చేసుకోవచ్చును. ధనము ఖర్చు పెరుగుతుంది జాగ్రత్త.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో కుటుంబంలో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. ధనలాభంను పొందుటకు అవకాశం ఉంది. ఆది, సోమ, మంగళవారాల్లో నలుగురిలో మంచి పేరును సంపాదించుకుంటారు. చేపట్టిన పనుల మూలాన లాభంను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. స్త్రీ/పురుష సౌఖ్యంను పొందుతారు. బుధ, గురువారాల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయడం వలన కొంత మేలుజరుగుతుంది. వారం మొత్తం మీద సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. కావున సర్దుబాటు విధానం కలిగిఉండుట మేలు. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. పనుల్లో జాప్యం కలుగుటకు అవకాశం కలదు. ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం మంచిది. నచ్చిన పనులకు సమయాన్ని ఇచ్చు అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో కొంత ముందుకు వెళ్ళు ప్రయత్నాలు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కొంత మేర సహయపడినను సరైన ఆలోచనలు చేయుట మంచిది.

ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఒకవార్త కొంత వరకు అసంతృప్తిని కలుగజేస్తుంది. ప్రయత్నాల్లో ఆశించిన వేగం కనబడక పోవచ్చును. కావున వేచిచూసే ధోరణి కలిగి ఉండుట అన్నివిధాల మంచిది. తలపెట్టిన పనులను మద్యలో ఆపివేసే అవకాశం ఉంది. ఆది, సోమ, మంగళవారాల్లో గతంలో చేపట్టిన పనులను కొనసాగించి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం చేత పనులు ముందుకు కదులుతాయి. బుధ, గురువారాల్లో రాజాకీయ పరమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఉంది. పెద్దలతో కలిసి నూతన పనులను చేపడుతారు. వారం మొత్తం మీద ప్రయాణాల మూలాన మొదట్లో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ధనమును కోల్పోయే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు ప్రయత్నం చేయండి. వారితో మాట పట్టింపులకు పోకపోవడం మంచిది. సంచరం చేయవలసి రావచ్చును జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. చిన్న చిన్న విషయాలకే ఇబ్బందులు పొందుతారు.

మకర రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు కలుగుట చేత మానసిక ఆందోళన చెందుతారు. ప్రయాణాలు వాయిదా వేసే ప్రయత్నం చేయండి మంచిది. బందుమిత్రులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. ఆది, సోమ, మంగళవారాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు పొందుతారు. తలపెట్టిన పనులను మధ్యలో వదిలివేసే ఆస్కారం ఉంది జాగ్రత్త. ఉద్యోగంలో అధికారులతో కలిసి తీస్కోనే నిర్ణయాలు పెద్దగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చును. ఒకవార్త భాదను కలిగించేదిగా ఉంటుంది. మానసికంగా దృడంగా ఉండుట మంచిది. బుధ, గురువారాల్లో కుటుంబంలో వచ్చు చిన్న చిన్న మార్పులు సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. వారం మొత్తం మీద మొదట్లో బంధువులతో సమయాన్ని గడుపుతారు ఆర్థికంగా బాగున్నా చివరకు ఖర్చులు పెరుగు సూచనలు కలవు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి మంచిది. ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో అధికారులతో మంచి సంభందాలను కొనసాగించే ప్రయత్నం చేయండి ఉత్తమం. స్థానచలనం కలుగుటకు అవకాశం ఉంది. బంధువులను కలిసే అవకాశముంది.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఇష్టమైన పనులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ధనలాభంను పొందుతారు. నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం కలదు. మనోదైర్యంను కలిగి ఉండి ముందుకు వెళ్తారు. ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఆది, సోమ, మంగళవారాల్లో బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకండి నిదానంగా వ్యవహరించుట మంచిది. నూతన ప్రయత్నాలను ఆరంభించక పోవడం మంచిది. ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలు జరుగుతుంది. బుధ, గురువారాల్లో ఆరోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాల మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. వారం మొత్తం మీద రాజకీయవ్యవహారాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. అధికారులను కలుస్తారు వారితో చర్చలు చేయటకు అవకాశం ఉంది. అధికారుల మూలాన లాభంను పొందుతారు. ఎక్కువసమయం బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. మంచి భోజనం పొందుతారు. మధుర పదార్థాల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ప్రయాణాలలో చికాకులు కలుగుతాయి. ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంబంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో నిదానం అవసరం.

మీన రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో మాటలను పొదుపుగా వాడుట మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు చేయకండి నిదానంగా వ్యవహరించుట మేలు. భోజనం విషయంలో అశ్రద్ద చేయకండి. చేపట్టిన పనులలో ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చును. ఆది, సోమ, మంగళవారాల్లో ఉత్సాహంను కలిగి ఉండి ముందుకు కలుడులుతారు. బంధుమిత్రులతో చర్చలు చేపట్టు అవకాశం కలదు. అర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కలదు. ఇష్టమైన వారిని కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో పనిభారంను పొందుతారు. పనులు కొంత నిదానంగా ముందుకు సాగే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట ఉత్తమం. వారం మొత్తం మీద మొదట్లో చేపట్టిన పనులలో ఖర్చులు కలుగినను చివరకు ఆ సమస్యను అధిగమిస్తారు. కలహములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మంచిది. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి పేరును పొందుతారు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట మంచిది. మీ ఆలోచనలను ఇతరులు వ్యతిరేకిస్తారు. సర్దుబాటు విధానం అవసరం.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
inhibition