Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
heights of nudity

ఈ సంచికలో >> సినిమా >>

ఆ కెమెరాలు అక్కడ పెట్టొచ్చుగా

Sting Operations

టెలివిజన్‌, వెబ్‌ మీడియా రంగాల్లో స్టింగ్‌ ఆపరేషన్స్‌కి ఓ ప్రత్యేకత వుంటుంది. అలాంటి ఆపరేషన్స్‌ చేపట్టాలంటే యుక్తి, శక్తి, తెగువ అన్నీ ఉండాలి. రాజకీయ నాయకుల్ని ఇరకాటంలో పెట్టే స్టింగ్‌ ఆపరేషన్స్‌కి ప్రజల నుంచి మద్దతు వస్తుంటుంది. తమను జలగల్లా పీడిస్తోన్న కొందరు రాజకీయ నాయకుల బండారం బయటపడుతోంటే ప్రజలూ సంతోషిస్తారు.

కాని హీరోయిన్ల మీద స్టింగ్‌ ఆపరేషన్లు జరిగితే తద్వారా ఆ హీరోయిన్లకు కొన్ని సందర్భాల్లో మేలు చేయడం, లేదంటే వారి ఇమేజ్‌ పాడవడం వంటివి జరుగుతాయి. ఓ హీరోయిన్‌పై ఓ టెలివిజన్‌ సంస్థ ఇటీవల చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ అనంతరం స్టింగ్‌ ఆపరేషన్లపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమాజానికి ఉపయోగపడేలా స్టింగ్‌ ఆపరేషన్లు జరిగితే మంచిదని, సినీ తారలపై స్టింగ్‌ ఆపరేషన్స్‌తో సమాజానికి కలిగే మేలు ఏమీ ఉండదని, ఇదివరకు కొందరు ప్రౌఢ నటీమణులు స్టింగ్‌ ఆపరేషన్స్‌తో అప్పటికప్పుడు ఇబ్బంది పడ్డా, తిరిగి వారి వర్క్‌లో యధాతథంగా నిమగ్నమైపోయారని కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు వివిధ రకాలైన చర్చల సందర్భంగా. కేవలం టిఆర్‌పి రేటింగ్స్‌ గురించి ఆలోచించకుండా స్టింగ్‌ ఆపరేషన్స్‌కి ఉన్న ప్రత్యేకమైన బాధ్యతను మీడియా సంస్థలు గుర్తిస్తే బావుంటుంది. అది సమాజానికి మేలు చేస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
i like chennai