Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sting Operations

ఈ సంచికలో >> సినిమా >>

ఢిల్లీ సుందరికి చెన్నయ్‌ నచ్చింది

i like chennai

ఢిల్లీ బ్యూటీ తాప్సీ సౌత్‌లో బాగానే సెటిలైపోయింది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు ఎక్కువగానే చేస్తోన్న తాప్సీ, వీలు చిక్కినప్పుడల్లా హిందీ సినిమాలకూ ఓకే చెప్తోంది. ఉత్తరాదికి చెందిన అమ్మాయి అయినా, సౌత్‌తో తాప్సీ బాగా కనెక్ట్‌ అయ్యిందట. అందుకే తెలుగు, తమిళ భాషల్లో మాట్లాడటమూ నేర్చుకున్నానని తాప్సీ అంటోంది.

హైద్రాబాద్‌ వచ్చినప్పుడు ఇక్కడి వాతావరణానికి ఫిదా అయిపోయే తాప్సీ, చెన్నయ్‌లో వింటర్‌ గురించి ప్రత్యేకంగా చెబుతుంది. వింటర్‌లో చెన్నయ్‌లో సినిమా షూటింగ్‌ని తాప్సీ బాగా ఎంజాయ్‌ చేస్తుందట. దేశమంతటా వింటర్‌లో చలివాతావరణం వున్నా, చెన్నయ్‌లో ప్రత్యేకంగా వుంటుందనీ, మరీ ముఖ్యంగా రాత్రి వేళ షూటింగులు చాలా బావుంటాయని తాప్సీ ట్వీట్‌ చేసింది.

చెన్నయ్‌లో వుంటే సాంబార్‌, హైద్రాబాద్‌లో వుంటే బిర్యానీ... అని ఎక్కడుంటే అక్కడ ఆ మాటలు చెప్పకుండా, ఎక్కడెక్కడ తనకు ఏమేం ఇష్టమో ఎక్కడికి వెళ్ళినా అవే మాటలు చెప్పడం ద్వారా తాప్సీ అందర్నీ కట్టి పడేస్తోంది. ఉత్తరాది అమ్మాయిని అయినప్పటికీ, తెలుగు, తమిళ సంప్రదాయాలు తనను బాగా కట్టి పడేశాయని, అది తన అదృష్టమని తాప్సీ చెప్పింది.

 

మరిన్ని సినిమా కబుర్లు
uyyaalaina jampaalaina