Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
i like chennai

ఈ సంచికలో >> సినిమా >>

ఉయ్యాలైనా జంపాలైనా

uyyaalaina jampaalaina

అక్కినేని నాగార్జున, సురేష్‌బాబు సంయుక్తంగా రూపొందిస్తున్న ‘ఉయ్యాల జంపాల’ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్‌ని కొత్తగా చేస్తుండడం, ట్రెయిలర్‌ ఆకట్టుకుంటుండడంతో సినిమా గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

‘చిన్నారి పెళ్ళికూతురు’ అనే టెలివిజన్‌ ధారావాహికతో తెలుగువారికి సుపరిచితురాలైన ఆ సీరియల్‌లోని బాలనటి, అవిక (ఆనంది) ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యిందని ట్రెయిలర్‌ని బట్టి చెప్పొచ్చు. పదహారణాల అచ్చ తెలుగు కథాంశంగా ‘ఉయ్యాల జంపాల’ గురించి చెప్పుకోవచ్చన్పిస్తోంది.

సినిమాలోని ‘ఉయ్యాలైనా జంపాలైనా’ పాటకి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాట చార్ట్‌ బస్టర్స్‌లో మంచి స్థానం ఇప్పటికే సంపాదించుకుంది. యూత్‌ని సినిమా టీజర్‌ బాగా ఎట్రాక్ట్‌ చేసింది, ఫ్యామిలీస్‌ సైతం కనెక్ట్‌ అవుతున్నారు. సినిమా థియేటర్లలోకి వచ్చాక ప్రేక్షకులు ఎలాంటి మార్కులేస్తారో చూడాలి. ఎక్కువమంది చాలాకాలం తర్వాత మంచి పాట వింటున్నాం అని ‘ఉయ్యాలైనా జంపాలైనా’ పాట గురించి మాట్లాడుకుంటున్నారంటే, సినిమా తొలి విజయం విడుదలకు ముందు సాధించేసినట్టే కదా.

మరిన్ని సినిమా కబుర్లు
in memory of that hero