Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
in memory of that hero

ఈ సంచికలో >> సినిమా >>

బెజవాడ

Bezawada again?

నాగచైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ సినిమా అప్పట్లో విడుదలకు ముందు టాలీవుడ్‌లో పెను సంచలనానికి కేంద్రమైంది. సినిమా విడుదలయ్యాక తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. విజయవాడలోని రౌడీయిజం నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కినా, ఒకనాటి వంగవీటి 'దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుని సినిమాగా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం అంతకుముందు జరగడమే ఆ సినిమా వార్తల్లోకెక్కడానికి కారణం.

ముందు జరిగిన ప్రచారానికి, సినిమా తెరకెక్కిన విధానానికీ సంబంధం లేకపోవడం, సినిమాలో పస లేకపోవడం ఆ సినిమా పరాజయానికి కారణాలుగా చెప్పొచ్చు. అదలా ఉంచితే, ఇంకో సినిమా అదే బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లుగా చెబుతున్నారు సినీ వర్గాల్లో కొందరు. మారుతి దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా ‘రాధ’ అనే సినిమా రూపొందనుంది.

ఈ ‘రాధ’ సినిమా ఒకనాటి బెజవాడలోని ఆధిపత్య పోరు నేపథ్యంలో రూపొందనుందంట. ఇదెంత నిజమో తెలియదుగానీ, మారుతి కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందినవాడు. పైగా ఈ సినిమాలో వెంకటేష్‌ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. దాంతో, మళ్ళీ ‘బెజవాడ’ నేపథ్యంలోనే మారుతి ‘రాధ’ సినిమాని తెరకెక్కిస్తున్నాడనే ఊహాగానాలకు ఇంకాస్త మసాలా యాడ్‌ అవుతోందనుకోవచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam