Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with karthi

ఈ సంచికలో >> సినిమా >>

ధూమ్ 3 - చిత్ర సమీక్ష

Movie Review - Dhoom 3

చిత్రం: ధూమ్‌'3'
తారాగణం: ఆమిర్ ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఉదయ్‌ చోప్రా, కత్రినాకైఫ్‌, జాకీష్రాఫ్‌, టాబ్రెట్‌ బెథెల్‌, ఆండ్రూ బిక్‌నెల్‌, సిద్దార్ధ్‌ నిగమ్‌ తదితరులు
ఛాయాగ్రహణం: సుదీప్‌ ఛటర్జీ
సంగీతం: ప్రీతమ్‌
నిర్మాణం: యష్‌ రాజ్‌ ఫిలింస్‌
నిర్మాతలు: ఆదిత్య చోప్రా
దర్శకత్వం: విజయ్‌ కృష్ణ ఆచార్య
విడుదల తేదీ: 20 డిసెంబర్‌ 2013

క్లుప్తంగా చెప్పాలంటే :
చికాగోలో ఓ బ్యాంక్‌ని దోచుకుంటాడు సాహిర్‌ (ఆమిర్‌ఖాన్‌). సాహిర్‌కి ఓ సర్కస్‌ కంపెనీ వుంటుంది. అతను ఆ దొంగతనం చేయడం వెనుక ఓ పెద్ద కారణం వుంటుంది. సాహిర్‌ని పట్టుకోవడానికి ఇండియా నుంచి ఏసీపీ జై దీక్షిత్‌ (అభిషేక్‌ బచ్చన్‌), అలీ (ఉదయ్‌ చోప్రా) చికాగో వస్తారు. సర్కస్‌లో సాహిర్‌కి ఆలియా (కత్రినా) పరిచయమవుతుంది. ఏసీపీ జై దీక్షిత్‌, అలీ కలిసి సాహిర్‌ని పట్టుకున్నారా? సాహిర్‌ దొంగతనం చేయడానికి గల కారణాలేంటి? అనేది తెరపై చూడాల్సిందే.


మొత్తంగా చెప్పాలంటే :
నటుడిగా ఆమిర్‌ఖాన్‌ గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో సినిమాకి జీవం పోశాడు. సినిమా కోసం అతను పడ్డ కష్టమంతా సినిమాలో కన్పిస్తుంది. అందుకే ఆమిర్‌ఖాన్‌ మిస్టర్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌ అయ్యాడు. తన డాన్సులతో, తన గ్లామర్‌తో కత్రినాకైఫ్‌ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్‌ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. అభిషేక్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. ఉదయ్‌ చోప్రా తన చిలిపి చేష్టలతో నవ్వించాడు. ఫారిన్‌ నటుల గురించి గొప్పగా చెప్పుకోడానికేం లేదు. జాకీష్రాఫ్‌ ఓకే.

టెక్నికల్‌ అంశాల విషయానికొస్తే, సినిమాటోగ్రఫీ సూపర్బ్‌గా వుంది. ఎడిటింగ్‌ బావుంది. కాస్ట్యూమ్స్‌ స్టయిలిష్‌గా అన్పిస్తాయి. సినిమాకి కావాల్సిన స్టైయిలష్‌ లుక్‌ కాస్ట్యూమ్స్‌ ద్వారా లభించింది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, సినిమాకి మంచి లుక్‌ తీసుకొచ్చింది. స్క్రిప్ట్‌, డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే... అన్నీ సినిమాకి ప్లస్సయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. మూడు పాటలు చాలా బాగున్నాయి.

ధూమ్‌ సిరీస్‌లో ఇది మూడో సినిమా. ప్రతి సినిమా కాన్సెప్ట్‌ దాదాపు ఒక్కటే. అయితే, సినిమాలో ప్రేక్షకుడ్ని లీనం చేయడానికి దర్శకుడు ఎంచుకున్న విధానమే విభిన్నంగా వుంటోంది. ఈ సినిమాలోనూ దర్శకుడు తన పనితనం బాగానే ప్రదర్శించాడు. సినిమా అంతా ఎనర్జిటిక్‌గా కన్పిస్తుంది. ఎక్కడా పేస్‌ తగ్గలేదు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సెకెండాఫ్‌లో మాత్రం పేస్‌ కాస్త మందగించిందనే చెప్పాలి. క్లయిమాక్స్‌లో మళ్ళీ సినిమా పుంజుకుంది. ఓవరాల్‌గా చూస్తే, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. గగుర్పొడిచేలా యాక్షన్‌ మూమెంట్స్‌, హై టెక్నికల్‌ వాల్యూస్‌ సినిమా రేంజ్‌ని పెంచాయి.
ఆమిర్‌ఖాన్‌ ఇమేజ్‌, కత్రినా గ్లామర్‌ సినిమా రేంజ్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్ళే అవకాశం వుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే: పవర్‌ ప్యాక్డ్‌ అండ్‌ టెక్నికల్‌ బ్రిలియంట్‌ మూవీ

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu