Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anubandhalu telugu serial thirty second Part

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

మెక్సికో - అమెరికా బార్డర్ లో ఓట్రుకోలో చట్టవిరుద్ధంగా అమెరికాకి వలస వస్తున్న కొందరు మెక్సికన్స్ ని అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. అయితే వారి ప్రశ్నలకి ఆ మెక్సికన్స్ ఎవరూ సమాధానాలు చెప్పలేదు. వారెవరికీ ఇంగ్లీష్ రాదు.
దాంతో తెలివైన ఓ అధికారి మెషిన్ గన్ లోకి మేగజైన్ ని ఎక్కించి చెప్పాడు.
"వీళ్ళందర్నీ అవతలికి తీసుకెళ్ళి కాల్చేస్తాను. ఆ బ్రౌన్ షూస్ వేసుకున్న వాడితో మొదలు పెడతాను."
వెంటనే ఇద్దరు ముందుకి వచ్చి 'డోంట్ షూట్' అని అరిచారు.
వాళ్ళని దుబాసిలుగా ఉపయోగించి నిజంగా ఇంగ్లీష్ రాని మిగిలిన వాళ్ళని ఇంటరాగేట్ చేశారు అధికారులు.



హ్యూస్టన్ లోని ఓ దొంగని చివరికి పోలీసులు పట్టుకొన్నారు. మూడు నెలల్లో 7 సార్లు అతను 'యు - టోటెమ్' అనే స్టోర్ లో దొంగతనం చేసాక, ఎనిమిదోసారి దొంగతనానికి వచ్చిన అతన్ని నిఘావేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.

 

మరిన్ని సీరియల్స్