Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

కీమా మటర్ - పి. పద్మావతి

కావలసిన పదార్థాలు:
కీమా, మటర్(పచ్చి బఠానీలు), ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి

తయారు చేయు విధానం:
ముందుగా పాన్ లో నూనె వేడిచేసుకుని ఉల్లిపాయముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు దోరగా వేగించుకోవాలి. దోరగా వేగిన తరువాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు తిప్పాలి. తరువాత దానిలో పసుపు, సరిపడినంత ఉప్పు, కీమా వేసి బాగా కలపాలి. కలిపిన తరువాత చిన్న మంట చేసి మూత పెట్టుకోవాలి. కీమా నుంచి వాటర్ వస్తుంది. నీళ్ళు పొయ్యవలసిన అవసరం లేదు. కీమా నుంచి వాటర్ వచ్చిన తరువాత కొంచెం కారం వేసి రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తరువాత దానిలో మటర్, మసాలాపొడి వేసి ఐదు నిమిషాలు ఉడికిస్తే కీమా మటర్ రెడీ.

 

మరిన్ని శీర్షికలు