Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
writers became directors

ఈ సంచికలో >> సినిమా >>

మేకప్‌ లేకుండా మోహన్‌బాబు

Mohanbabu without Makeup

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు నటిస్తున్నారనే వార్తను మొదట్లో ఎవరూ నమ్మలేదు. వార్త నిజమే అయినా కార్యరూపం దాల్చడం అనుమానం అనుకున్నారు కొందరు. సినిమా వచ్చినా, వర్మ దర్శకత్వం కాబట్టి అనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి.

ఆ అనుమానాల్ని వర్మ ` మోహన్‌బాబు కాంబినేషన్‌ పటాపంచలు చేస్తుందట. ‘ఒట్టు’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా రూపొందనుంది. ఇందులో మోహన్‌బాబు ఎలాంటి మేకప్‌ లేకుండా ఒరిజినల్‌ గెటప్‌లో కనిపిస్తారట. గెటప్‌లో కనీసం విగ్గు లేకుండా మోహన్‌బాబు కనిపిస్తారని ఇన్‌సైడ్‌ సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.

వర్మ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని, సినిమాకి అంతా పక్కాగా ప్రిపేర్‌ చేసుకున్నాకే వర్మ రంగంలోకి దిగాడనీ సమాచారం. తెలుగులో వర్మ హిట్‌ కొట్టి చాన్నాళ్ళు అవడంతో ఆ లోటు ఈ సినిమాతో తీరితే వర్మ అభిమానులకు ఇంకేం కావాలి? మోహన్‌బాబు కూడా చాన్నాళ్ళ తర్వాత పూర్తిస్థాయి పాత్రలో కనిపిస్తున్న చిత్రమిది. తద్వారా మోహన్‌బాబు అభిమానులకూ ఈ సినిమా ఫుల్‌ ట్రీట్‌ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా కబుర్లు
That is Bapu bomma