Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
That is Bapu bomma

ఈ సంచికలో >> సినిమా >>

ప్రకాష్‌రాజ్‌ మూడు వంటలు

Prakash Raj Direction

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌, ఏ సినిమాలో నటించినా తనదైన ప్రత్యేకత ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు. నిర్మాతగా, దర్శకుడిగా విభిన్నమైన ప్రయత్నాలు చేస్తారాయన. కమర్షియల్‌ ఆలోచనలకు భిన్నంగా వెళ్ళి ‘ధోని’ అనే సినిమా తీశారాయన. ఇప్పుడు ‘ఉలవచారు బిర్యానీ’ పేరుతో ఓ వెరైటీ చిత్రాన్ని తీస్తున్నారు ప్రకాష్‌రాజ్‌.

మలయాళంలో వచ్చిన ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’ సినిమాకి ఈ ‘ఉలవచారు బిర్యానీ’ రీమేక్‌. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయనున్నారు. కన్నడలో ‘వగ్గరనె’ పేరుతో ఈ సినిమా విడుదలవుతుంది. మలయాళంలో కన్నా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా పెద్ద విజయం సాధించనుందని ప్రకాష్‌రాజ్‌ ధీమాగా ఉన్నారు.

తమిళంలో ‘ఉన్‌ సమయల్‌ అరయిల్‌’ పేరుతో రానున్న ఈ సినిమా గురించి తమిళ ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొన్నది. ‘ఉన్‌ సమయల్‌ అరయిల్‌’ అంటే తెలుగులో ‘మీ వంటింట్లో’ అని అర్థం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రకాష్‌రాజ్‌ వంటకం ప్రేక్షకులకు ఎలా రుచిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా కబుర్లు
Chances for Avika Gor?