Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Prakash Raj Direction

ఈ సంచికలో >> సినిమా >>

పెళ్ళికూతురికి అవకాశాలొస్తాయా?

Chances for Avika Gor?

అవికా గోర్‌ తెలుగు తెరకు కొత్త హీరోయిన్‌. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. అవికా గోర్‌ అనడం కన్నా, ‘చిన్నారి పెళ్ళికూతురు’ ఆనంది అంటే అందరికీ తొందరగా కనెక్ట్‌ అవుతుంది. ఆ టెలీ సీరియల్‌లో బాల నటిగా కనిపించిన అవిక, ఇప్పుడు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సంచనాలకు సిద్ధమైంది.

తొలి సినిమా మంచి విజయం సాధించే దిశగా దూసుకెళ్తుండడం పట్ల అవిక ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆమె మలి సినిమా హీరో నితిన్‌తో చేస్తోందట. నితిన్‌ సినిమాతో పాటు, ఇంకొన్ని అవకాశాలు ఆమెకు రానున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ల కొరత వుండడంతో యువ హీరోలు, అవిక గురించి ఆలోచిస్తున్నారట.

రానున్న రోజుల్లో పలువురు టాలీవుడ్‌ యంగ్‌ హీరోలతో అవిక సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. చిన్నారి పెళ్ళి కూతురు, భవిష్యత్‌లో తెలుగులో పెద్ద హీరోయిన్‌ అయినా అవ్వొచ్చు. నటనలో ఘనాపాటి అని తొలి సినిమాతో అనిపించుకోవడం ఆమెకు పెద్ద ప్లస్‌ పాయింట్‌.

మరిన్ని సినిమా కబుర్లు
VN Aditya's Park