Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Chances for Avika Gor?

ఈ సంచికలో >> సినిమా >>

విఎన్‌ ఆదిత్య ‘పార్క్‌’లో ప్రేమకథ

VN Aditya's Park

సెన్సిటివ్‌ లవ్‌స్టోరీస్‌ని నీట్‌గా తెరకెక్కించడంలో విఎన్‌ ఆదిత్యది ప్రత్యేకమైన శైలి. ఆయన ‘పార్క్‌’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారిప్పుడు. మంచి ప్రేమ కథను అందంగా తెరపై చూపించబోతున్నారట వి.ఎన్‌. ఆదిత్య ‘పార్క్‌’ సినిమాలో. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.

సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ‘బాయ్‌ఫ్రెండ్‌ కుక్కపిల్ల..’ అనే పాటను సరయు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. దీనికి శ్రోతల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోందిట. మంచి మ్యూజిక్‌తో చాలా సినిమాల విజయంలో కీలక భూమిక పోషించిన శ్రీలేఖ, ఈ సినిమాకి సంగీతం అందించారు.

ప్రేక్షకుల మనసుల్ని మెప్పించేలా ఈ సినిమా వుంటుందని దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య చెప్పారు. సినిమా ఘనవిజయం సాధిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమాతో వుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Joke on Nagababu