Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
VN Aditya's Park

ఈ సంచికలో >> సినిమా >>

నాగబాబుపై ఆ జోక్‌ ఏంటి?

Joke on Nagababu

సినిమాల్లోనే కాకుండా టీవీల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌నే ఎక్కువ ఇష్టపడ్తున్నారు ప్రేక్షకులు. వారి అభిరుచి అలా మారింది. మూస టెలీ సీరియల్స్‌ కన్నా, సరదా సరదాగా సాగిపోయే ప్రోగ్రామ్స్‌ని బుల్లితెర వీక్షకులు ఎక్కువగా ఇష్టపడ్తున్నారు. అలాంటి ప్రేక్షకుల కోసం చాలా కామెడీ షోలు బుల్లితెరపై కనువిందు చేస్తున్నాయి.

‘జబర్‌దస్త్‌’ పేరుతో వస్తోన్న ఓ కామెడీ షోలో, వివిధ రకాలైన స్కిట్స్‌ని పార్టిసిపెంట్స్‌ రూపొందించి, వీక్షకుల మన్ననలు పొందుతున్నారు. కొన్నిసార్లు ఈ జోక్స్‌ చూస్తున్నవారిని ఇబ్బంది పెట్టేలా కూడా వుంటున్నాయి. హాస్యంలో భాగంగా ఆ షోలోనే ఒకరిపై ఒకరు సెటైర్స్‌ వేసుకుంటున్నారు. అలా ‘భారతదేశంలో జనాభా పెరగడానికి కారణమేంటి?’ అని ఓ పార్టిసిపెంట్‌ ఓ స్కిట్‌లో అంటే, అదే టీమ్‌లోని ఇంకో వ్యక్తి ‘నాగబాబుగారి కృషి’ అంటాడు.

వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా, పరిధి దాటకుండా ఆ షోకి సంబంధించినవారిపైనే జోక్స్‌ వేసుకోవడంతో పెద్దగా ఇబ్బందిలేదు. అయినప్పటికీ, కామెడీ పేరుతో అసభ్యత పాళ్ళు జొప్పిస్తే ఇబ్బంది తప్పదు. హాస్యంలో అసభ్యత కలిస్తే కష్టమే. నాగబాబు మీద వేసిన జోక్‌ కొందరికి అర్థం కాలేదు, ఇంకొకరు ‘ఇదేం జోక్‌’ అని పెదవి విరిచారు. మంచి పేరున్న ఆ షోకి ఇలాంటివి చెడ్డపేరు తెస్తాయి.

మరిన్ని సినిమా కబుర్లు
Cheppukondi Chuddam