Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Teluguvaari Tyagayya - Nagayya

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (డిసెంబర్ 27 - జనవరి 02) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున కుటుంబజీవితంలో సౌఖ్యంను పొందుతారు. బంధువులతో సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు చేయుప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది. మీ ఆలోచనలు తోటివారికి ఉపయోగపడుతాయి. శని, ఆదివారాల్లో చేపట్టిన పనుల మూలాన కీర్తిని పొందుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనము చేతికి అందుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు కలిసి వస్తాయి. మీ అభివృద్దిని కోరుకొనే వారిని కలిసే అవకాశం ఉంది, వారితో సమయాన్ని గడిపే అవకాశం ఉంది. గతంలో తలపెట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో అభివృద్దిని పొందుట చేత సంతోషంను పొందుతారు. సోమ, మంగళవారాల్లో పనిఒత్తిడి మూలాన అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. నూతన ప్రయత్నాలను వాయిదావేయుట మంచిది. సమయానికి భోజనం చేయండి. అశ్రద్ద వద్దు. బుధ, గురువారాల్లో కుటుంబంలో నూతన నిర్ణయాలు చేయకండి. అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. కలహాములకు దూరంగా ఉండుట అన్నివిధాల మంచిది. వారం మొత్తం మీద అకారణంగా ఇతరులతో చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది, సాధ్యమైనంత వరకు నిదానంగా వ్యవహరించుట మంచిది. ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. మీ ఆలోచనల మూలాన తోటివారు లాభంను పొందుతారు. కొన్నివిషయాల్లో నిరుత్సహంను పొందుటకు అవకాశం కలదు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది.

వృషభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ప్రయత్నాలలో నిదానం అవసరం. ఓపికను కలిగి ఉండుట తప్పక సహకరిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. అశుభవార్తను వినే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండుట మంచిది. శని, ఆదివారాల్లో కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. విందులు వినోదాలలో పాల్గొను అవకాశం ఉంది, సమయాన్ని వారితో గడుపుతారు. మీ ఆలోచనలు అందరికి సహాయం చేయాలనే విధంగా ఉంటాయి, ఇతరులకు ఉపయోగపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు, రావాల్సిన సొమ్ము సమయానికి అందుతుంది. నూతన పనులను ఆరంభించుట విషయంలో ఆసక్తిని చుపిస్తారు. సోమ, మంగళవారాల్లో ధనమునకు సంబంధించిన విషయాల్లో బాగానే ఉంటుంది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట చేత మంచి పేరును తెచ్చుకొనే అవకాశం ఉంది. అందరితో మంచి సంబంధాలు కలిగిఉండుట చేత లాభంను పొందుతారు. స్త్రీ మూలక లాభంను పొందుతారు వారి ద్వారా లాభం చేకూరుతుంది. బుధ, గురువారాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. నూతన పనులను వాయిదా వేయుట ఉత్తమం. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. వారం మొత్తం మీద చేపట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుట చేత ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతాయి ముఖ్యంగా మోకాళ్ళు, జీర్ణసంబంధ సమస్యలు కలుగుతాయి. భోజనం విషయంలో అశ్రద్ద వద్దు. సమయానికి భుజించుట మంచిది. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట ఉత్తమం.

మిథున రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ప్రయత్నాలలో ఆశించిన వేగం ఉండకపోవచ్చును. కొంత సర్దుబాటు విధానం ఆవలంభించుట వలన తప్పక మేలుజరుగుతుంది. బంధు మిత్రులతో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట ఉత్తమం. శని, ఆదివారాల్లో తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు పొందుటకు అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసికంగా దృడంగా ఉండుట సూచన. పెద్దల సలహాలను పాటించుట మంచిది, గతంలో చేపట్టిన పనులకు భాద్యత వహించడం ఉత్తమం. సోమ, మంగళవారాల్లో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయనికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు, నూతన అవకాశాల కోసం చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వార్తను వినే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో నలుగురిలో చేపట్టిన పనుల చేత మంచి పేరును తెచ్చుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. నూతన పరిచయాలు కలుగుతాయి. ఆశించిన దానికన్నా అధికమైన ఖర్చును పొందుతారు. వారం మొత్తం మీద తలపెట్టిన పనులలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగక పోవచ్చును. కుటుంబంలో సభ్యులకు స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది. నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట మంచిది. బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు. కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. పెద్దలను కలిసే అవకాశం ఉంది. సౌఖ్యవంతమైన జీవితాన్ని కోరుకుంటారు.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఇష్టమైన వారిని కలుస్తారు, వారి వలన లాభంను పొందుటకు అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాల కోసం చేయుప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. నూతన వస్త్రలాభంను పొందుతారు. శని, ఆదివారాల్లో పనులలో వేగం తగ్గుతుంది. ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవడం చేత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చును. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన వరకు పెట్టుబడులు పెట్టుటకు ఇప్పుడు మంచి సమయం కాదు. కొంతకాలం ఆగడం ఉత్తమం. సోమ, మంగళవారాల్లో ఒకవార్త కొంత నిరాశను కలిగించేదిగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే నిరుత్సాహంను పొందుతారు. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేయుట మంచిది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి కావున జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. బుధ, గురువారాల్లో పనులలో అధికమైన ఉత్సాహంను చూపించుట చేత సమయానికి పూర్తిచేస్తారు. ధనమునకు సంభందించిన విషయాల్లో నూతన అవాకాశాలు పొందుటకు ఆస్కారం కలదు. వారం మొత్తం మీద తలపెట్టిన పనులలో వేగం పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. ధనధాన్య సంవృద్ధిని కలిగి ఉంటారు. ఇష్టమైన పనుల యందు మాత్రం ఆసక్తిని కలిగి ఉంటారు. శరీరసౌఖ్యమునకు ప్రాముఖ్యతను ఇస్తారు. జీవితభాగస్వామితో విభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు, చాలావరకు సర్దుబాటు విధానం ఆవలంభించుట మంచిది.

సింహ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున అనుకోని కర్చులు కలుగుట చేత మానసిక ఇబ్బందులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చును. మంచి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. శని, ఆదివారాల్లో ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థికమైన విషయాల్లో బాగుంటుంది ఆశించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో మీరు అభివృద్దిని పొందుతారు. కాకపోతే పనులలో శ్రమను కలిగి ఉండే అవకాశం ఉంది. నూతన వస్త్రలాభంను కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. సోమ, మంగళవారాల్లో గతంలో తలపెట్టిన పనులకు ప్రాధన్యం ఇవ్వడం మంచిది. ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి. వీలయితే వాయిదా వేయుట మంచిది. ఫలితాలు అనుకూలంగా రాకపోవడం వలన ఆందోళన చెందుటకు అవకాశం ఉంది ఓపిక అవసరం. బుధ, గురువారాల్లో పనులను వాయిదా వేయుట మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కుటుంబంలో ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట వలన మేలు జరుగుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును. వారం మొత్తం మీద బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది, వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది స్థిరంగా ఆలోచనలు చేయుట మంచిది. మాటలను పొదుపుగా వాడుట ఉత్తమం. వ్యాపారరంగంలోని వారికి పెద్దగా యోగ్యమైన కాలంకాదు. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. ప్రతిపనిలో నిదానం అవసరం. ఖర్చుల విషయంలో మాత్రం స్పష్టమైన ఆలోచన కలిగి ఉంటే తప్పక మేలుజరుగుతుంది.
 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఉత్సాహంను కలిగిఉండి నూతన పనులను చేపట్టుటకు ఆసక్తిని కనబరుస్తారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ప్రతిపనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేపట్టుట వలన మేలుజరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో అశ్రద్ద పనికిరాదు. తగిన జాగ్రతలు తీసుకోవడం ఉత్తమం. పనులలో శ్రమను కలిగి ఉండే అవకాశం కలదు. ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును కావున సర్దుకుపొండి. సోమ, మంగళవారాల్లో ఉత్సాహంను కలిగి ఉంటారు. మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం వలన అనుకున్న పనులను పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికంగా మీరు ఆశించిన విధంగా ఫలితాలు కలుగుటకు ఆస్కారం కలదు. పెద్దల సలహాలతో విజయాలను నమోదుచేసే అవాకాశం ఉంది. బుధ, గురువారాల్లో పనులలో శ్రమను కలిగి ఉండే అవకాశం ఉంది. పనిభారంను పెంచుకోకుండా ఒక్కోక్కటిగా పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాల వలన ఇబ్బందులు కలుగుతాయి. అలసిపోయే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.  వారం మొత్తం మీద తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాల పరంగా నిర్ణయాలు తీసుకొనే ముందు బాగా ఆలోచించుట మంచిది, మధ్యలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున నిదానం అవసరం. మాతృ వర్గం నుండి విలువైన సమాచారంను పొందుతారు. ఆర్థికంగా కర్చులు కలిగినా సమయానికి సర్దుబాటు అవడం చేత ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చును. భోజనం విషయంలో మీకంటూ ప్రత్యేకమైన ఇష్టాలను కలిగి ఉంటారు.

తులా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోవుటకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కలుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. శారీరక శ్రమను పొందుతారు పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి నిదానం అవసరం. శని, ఆదివారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఆశించిన ఫలితాలను పొందుటకు దైవధ్యానం అవసరం. నచ్చిన పదార్ధాలను భుజించే అవకాశం కలదు. పనులలో సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు, సంతోషం ఉంటుంది. సోమ, మంగళవారాల్లో వ్యాపారంలో నూతన నిర్ణయాలు వద్దు. ప్రతి పనిని ఒకిటికి రెండు సార్లు ఆలోచించి చేయుట అనేది మంచిది. స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది. మానసికంగా కొన్ని విషయాల్లో దృడంగా ఉండుట సూచన. బుధ, గురువారాల్లో ఇష్టమైన వ్యక్తులకు సమయాన్ని ఇస్తారు వారితో సరదాగా గడిపే ఆస్కారం ఉంది. నూతన వస్త్రలాభంను కలిగి ఉంటారు. ధనలాభంను పొందుతారు, ప్రతి పనిలో మంచి ఆలోచన ఉన్నచో విజయం ఉంటుంది. వారం మొత్తం మీద బంధుమిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని మీకు నచ్చిన విధంగా గడిపే అవకాశం కలదు. సంతానమూలక సౌఖ్యంను పొందుతారు. ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. పనులను అధికంగా చేయుట వలన శ్రమను కలిగి ఉంటారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. వ్యతిరేక వర్గం వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తారు జాగ్రత్త. పెద్దలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోండి వారి సలహాలను సూచనలను పాటించుట ఉత్తమం. ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధువుల గృహంలో సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ధనలాభంను పొందుతారు, నూతన అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో వచ్చిన అవకాశాలను తమకు అనుకూలంగా మలచుకొనే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు, వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి మంచిది. అనుకోని ఖర్చులు కలుగుతాయి కొంత మానసిక స్థైర్యం అవసరం. బంధుమిత్రులతో మాత్రం మాటపట్టింపులకు పోకపోవడం అన్నివిధాల మంచిది. సోమ,మంగళవారాల్లో భోజనంనకు ప్రాధ్యానత ఇస్తారు. నచ్చిన పనులకు సమయన్ని ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాల కోసం చేయుప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంను కలిగి ఉండి కొత్త కొత్త పనులను చేపడుతారు, నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. బుధ, గురువారాల్లో ప్రతిపనిలో నిదానం అవసరం. ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వివాదములకు దూరంగా ఉండు ప్రయత్నం చేయండి మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. వారం మొత్తం మీద స్నేహాల పట్ల సరైన అవగాహన ఉండుట మంచిది, లేకపోతే ధనమునకు సంభందించిన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. భోజనం విషయాల్లో నచ్చిన పదార్థాలకు ప్రాముఖ్యత ఇస్తారు. తలపెట్టిన పనులలో విజయంను పొందుట ద్వారా మానసిక దైర్యం పెరుగుతుంది. ఆర్థికంగా నూతన అవకశాల కోసం ప్రయత్నాలు చేస్తారు, కొంత ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ప్రతిపనిలో నిదానం అవసరం.

ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఇష్టమైన పనులను చేపడుతారు. నచ్చిన వారికి సమయాన్ని ఇస్తారు వారితో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం కలదు. బంధువులతో విందులు, వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది, సంతోషంగా సమయన్ని గడుపుతారు. అధికారులకు అనుకూలమైన పనులను చేపట్టు అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ఉద్యోగంలో అధికారులతో మంచి గుర్తింపును పొందుతారు. ధనమునకు సంభందించిన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. బంధువులయెడల ప్రీతిని కలిగి ఉంటారు వారితో సమయన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. ప్రయత్నాలలో మంచి ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో బంధువుల గృహంలో సమయన్ని గడుపుతారు. మీ ఆలోచనలను వారితో పంచుకొనే అవకాశం కలదు. ఉద్యోగంలో మంచి గుర్తింపును కలిగి ఉంటారు. అందరితో కలిసి పనులను ఆరంభించి విజయాలను సొంతం చేసుకొనే ఆస్కారం కలదు. భోజనం విషయాల్లో మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. బుధ, గురువారాల్లో ఆలోచనలను తగించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. ధనమునకు సంభందించిన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణాల మూలాన ఇబ్బందులు కలుగుతాయి. వారం మొత్తం మీద సమయానికి భోజనం చేయట ఉత్తమం, పరుశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం మేలు. బంధుమిత్ర పరివారంతో విబేదాలు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. ఉద్యోగంలో బాగానే ఉన్నను ఆరోగ్యపరమైన సమస్యలు బాధిస్తాయి జాగ్రత్త. బంధువులతో చర్చలు చేయకపోవడం అనేది సూచన. రాజాకీయ వ్యవహరాల పట్ల మక్కువను కలిగి ఉంటారు సమయాన్ని ఇస్తారు.

మకర రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున, శని, ఆదివారాల్లో  కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అకారణంగా కలుగు వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మాటలను పొదుపుగా వాడుట మేలు. సోమ, మంగళవారాల్లో బంధుమిత్రులను కలిసి వారితో చర్చలు చేయుటకు అవకాశం కలదు. ఆశించిన పనులు పూర్తిచేయుట వలన సంతోషంను పొందుతారు. ధనమునకు సంబంధించిన విషయాల్లో పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆప్తులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించే ఆస్కారం కలదు. బుధ, గురువారాల్లో ప్రయాణాలు అనుకూలిస్తాయి, బంధువుల గృహంలో సమయాన్ని గడుపుతారు. భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో తలపెట్టిన పనులకు మంచి గుర్తింపును పొందుతారు. ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వారం మొత్తం మీద అనుకోని ప్రయాణాలు చేయుట వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. మీ ఆప్తులకు అనారోగ్యసమస్యలు కలుగుట వలన భాధకు గురయ్యే అవకాశం కలదు. నలుగురిలో గౌరవం పొందుటకు చేయుప్రయత్నాలు ఫలించక పోవచ్చును. స్థానచలనంను పొందుతారు. మరొక ప్రదేశంలో నివశించవలసి రావొచ్చును. ఖర్చుల విషయంలో మాత్రం నిదానం అవసరం. అనుకోని ఖర్చుల విషయంలో జాగ్రతగా వ్యవహరించాలి. మీ అనుకున్న వారితో సర్దుకుపోవడం వలన మనస్పర్థలు తగ్గుతాయి. అగ్నికి సంబంధించిన పనులను చేపట్టినపుడు మాత్రం నిదానంగా వ్యవహరించుట ఉత్తమం, లేకపోతే ప్రమాదం కలుగుతుంది.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున తలపెట్టిన పనులు నిదానంగా ముందుకు వెళ్తాయి, సర్దుబాటు అవసరం. ఉద్యోగంలో శ్రమను పొందుటకు అవకాశం ఉంది మంచి ప్రణాళిక అవసరం. అనారోగ్యసమస్యలు బాధిస్తాయి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శని, ఆదివారాల్లో కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి, అలాగే అందరిని కలుపుకొని వెళ్ళడం అనేది సూచన. నూతన ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది. పనులలో ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయుట వలన ఫలితాలు వస్తాయి. ధనము విషయంలో మాత్రం ఖర్చులు తప్పక పోవచ్చును. సోమ, మంగళవారాల్లో పెద్దలతో మంచి సంబంధాలు ఉండటం వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాలను ఆరంభించే అవకాశం ఉంది. ప్రణాళిక ప్రధానపాత్ర పోషిస్తుంది. మీయొక్క పనులు విజయాన్ని సాధించుటలో కావున ప్రణాళిక అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి ఆదిశలో ప్రయత్నం పెంచుట మంచిది. ఉద్యోగంలో బాగుటుంది మంచి ప్రాధాన్యం కలిగి ఉంటారు. బుధ, గురువారాల్లో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఫలితాలు సంతృప్తిని కలిగించే విధంగా ఉంటాయి. బంధువులతో సమయాన్ని గడుపుతారు. మిత్రులతో నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు ఆలోచనలు చేస్తారు. వారం మొత్తం మీద మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలను అందిపుచ్చుకొనే అవకాశం ఉంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్త అవసరం. వివాదములకు దూరంగా ఉండుట మంచిది. అధికారులతో మంచి సంబంధాలు ఉపకరిస్తాయి. గౌరవం పెరుగుటకు అవకాశం ఉంది, మీ ఆలోచనలో ప్రాధాన్యం ఉంది.

మీన రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు, సంతృప్తిని కలిగి ఉంటారు. చేపట్టిన పనుల వలన గుర్తింపును పొందుతారు. స్త్రీ / పురుష సౌఖ్యంను కలిగి ఉంటారు, నూతన పరిచయాలు కలుగుతాయి. శని, ఆదివారాల్లో ధనము విషయంలో సంతృప్తిని కలిగి ఉంటారు. తలపెట్టిన పనులలో ఆశించిన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. నలుగురిలో మంచిగుర్తింపు కోసం మీరు చేయుప్రయత్నాలు మంచి ఫలితాలను కలుగజేస్తాయి. ప్రయాణాల మూలాన లాభంను పొందుతారు. నూతన అవకాశాలు కలుగుతాయి. అధికమైన పనిని కలిగి ఉంటారు. సోమ, మంగళవారాల్లో పనిఒత్తిడి ఉండుట చేత అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. విశ్రాంతి అవసరం అని గుర్తిస్తారు అలాగే ఆలోచనల్లో నిధానం అవసరం. సమయానికి భోజనం చేయుట కూడా అవసరం. పనులలో అధికమైన శ్రమను పొందుతారు, పనులు నిధానంగా పూర్తయ్యే అవకాశం కలదు. బుధ, గురువారాల్లో కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు బాగుండాలి, అదేవిదంగా చర్చలకు సమయాన్ని ఇవ్వకపోవడం ఉత్తమం. నూతన ప్రయత్నాలు చేయకండి, గతంలో ఆరంభించిన పనులను పూర్తిచేయుట ఉత్తమం. ఖర్చులను అదుపు చేయుటలో విఫలం అయ్యే అవకాశం ఉంది కావున ప్రత్యేకదృష్టిని పెట్టుట మంచిది. వారం మొత్తం మీద బంధుమిత్రులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. అధికారులకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. రాజకీయ వ్యవహారాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల మద్య చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. నిదానం అవసరం. పనులలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును అయినను పనులను పూర్తిచేస్తారు.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Book Review - telugulo samasya pooranalu