Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anubandhalu telugu serial thirty third Part

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

లాస్ ఏంజెలెస్ లోని ఓ బేంకులోకి దొంగతనానికి చొరబడ్డ ఇద్దరు దొంగలు, చేతిలోని పిస్తోళ్ళని చూపించి అరిచారు.
"ఎవ్విరి బడి డౌన్" బేంకులోని కస్టమర్స్, స్టాప్ అంతా నేలమీద బోర్లాపడుకున్నారు. వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి ఎవరూ నిలబడి లేరు. కేషియర్ ని లెమ్మంటే ఎవరూ లేవలేదు. ఇంకవాళ్ళకు ఏంచేయాలో తోచక ఉత్తి చేతులతో వెళ్ళిపోయారు.



కాలిఫోర్నియాలోని మోడెస్టో అనే ఊళ్ళో స్టీవెన్ రిచర్డ్ కింగ్ అనే ఓ దొంగ, 'బేంక్ ఆఫ్ అమెరికా' లో దొంగతనం చేసే ప్రయత్నంలో ఉండగా ఆ బేంక్ స్టాఫ్ అతన్ని పట్టుకుని పోలీసులకి అప్పచెప్పారు.
తన దగ్గర ఆయుధం లేకపోయినా, అది ఉన్నట్లు భ్రమింపచేయడానికతను తన బొటన, చూపుడు వేళ్ళని కప్పిన కర్టెన్ లోంచి పిస్తోలు ఆకారంలాచేసి వాళ్ళని బెదిరించాడు. కాని డబ్బు తీసుకోడానికి ఆచేతినే ఉపయోగించడంతో రహస్యం బయటపడింది.

 

మరిన్ని సీరియల్స్