Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Tenneti Viswanatham Biography by TVS Sastry

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (జనవరి 03 - జనవరి 09) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో తలపెట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కోనసాగుతాయి. ఇష్టమైన పనులను చేపట్టుటలో ఇష్టంను కలిగి ఉంటారు. బంధువులయెడల ప్రీతిని కలిగి ఉంటారు వారితో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా అనుకున్న పనులు నెరవేరుట ద్వారా మేలు జరుగుతుంది. ఆది, సోమవారాల్లో మృష్టాన్నభోజనప్రాప్తిని కలిగి ఉంటారు, భోజనసౌఖ్యంను పొందుతారు. ధనమునకు సంబంధించిన విషయాల్లో మంచి అవకాశాలు కలుగుతాయి వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. మంగళ, బుధవారాల్లో అధికంగా ఆలోచనలు చేయుట వలన కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం కలదు, కావున ఆలోచనలను నియత్రించుకోవడం ఉత్తమం. బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకండి నిదానం అవసరం. నూతన పనులను వాయిదా వేయుట ఉత్తమం. అనుకోని ఖర్చులు కలుగుతాయి తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. గురువారం ఉత్సాహంను కలిగి ఉంటారు కాకపోతే ఆలోచనలు చేయునపుడు పెద్దల సూచనలు పాటించుట తప్పక మేలుచేస్తుంది. భోజనం విషయంలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండే అవకాశం కలదు. వారంమొత్తం మీద ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది. అకారణంగా ఏర్పడు కలహాముల పట్ల జాగ్రత్తగా ఉండుట సూచన. ప్రయాణాల విషయంలో బాగాఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది సూచన. గతంలో తీసుకున్న ఋణముల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. నిరుత్సాహంను పొందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచిది. వ్యతిరేకవర్గం విషయంలో నిదానంగా వ్యవహరించుట మంచిది.

వృషభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో మరొకప్రదేశంలో నివసించవలసి రావొచ్చును. నచ్చని విధంగా సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో చేయు ఆలోచనల విషయంలో నిదానం అవసరం, మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది, నిదానంగా వ్యవహరించుట మంచిది. సంతానపరమైన ఇబ్బందులు కలుగుతాయి సర్దుకుపొండి నిదానం అవసరం. ఆది, సోమవారాల్లో తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు వారితో సమయన్ని గడుపుటకు అవకాశం కలదు. అధికారులతో మీకు గల మంచి పరిచయాలు ఉపయోగపడుతాయి. ఇష్టమైన పనులను చేపడుతారు, సమయాన్నినచ్చిన విధంగా గడుపుతారు. మంగళ, బుధవారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. మానసికంగా సంతోషంను పొందుతారు నచ్చిన పనులను చేపట్టు అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. గురువారం ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది, వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ధనమునకు సంబంధించిన విషయాల్లో మాత్రం అనుకోని ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త. వారంమొత్తం మీద శత్రువుల మూలాన వివిధ రూపములుగా ఇబ్బందులు పెరుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. ఒకవార్త వలన మానసికంగా బాధను పొందు అవకాశం ఉంది. భోజనం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు, సమయానికి తీసుకొనే ప్రయత్నం చేయండి మంచిది. అకారణంగా భయంను కలిగి ఉంటారు, మాటల విషయంలో మాత్రం శ్రద్ద వహించుట ఉత్తమం తక్కువగా మాట్లాడండి. గురువుల యెడల భక్తిని కలిగి ఉంటారు. పెద్దలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు వారికి నచ్చిన విధంగా మెలిగే అవకాశం ఉంది.

మిథున రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుట వలన శ్రమను పొందుతారు. నూతన ప్రయత్నాలను వాయిదావేయుట వలన మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయట అనేది సూచన. ఆది, సోమవారాల్లో కుటుంబంలో తీసుకొనే నిర్ణయాల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును, నిదానంగా వ్యవహరించుట మంచిది. స్థానచలనం పొందుతారు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మంగళ, బుధవారాల్లో అనుకున్న పనులను సమయానికి పూర్తిచేయుట వలన లాభంను పొందుతారు. బంధువులతో సమయన్ని గడుపుతారు, వారియందు ప్రీతిని కలిగి ఉంటారు. ప్రయత్నాలలో విజయంను పొందుతారు. గురువారం ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. మానసికంగా సౌఖ్యంను పొందుతారు. వారంమొత్తం మీద సంతానవిషయంలో ఆరోగ్యసమస్యలు కలుగుతాయి. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది కావున ప్రత్యేకశ్రద్ద అవసరం. బంధుమిత్రులతో కలిసి చేపట్టు పనులలో మాత్రం నిదానం అవసరం, అనవసరపు తప్పిదాలు చేయకండి వివాదములు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. అధికారులతో కలిసి చేపట్టిన పనులలో ఇబ్బందులు తప్పకపోవచ్చును కావున సర్దుబాటు వ్యవహరం మేలు. ఆరోగ్యం విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సమయాన్ని నచ్చిన విదంగా గడపాలనే తలంపును కలిగి ఉండుట వలన ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ధనాదాయం బాగుంటుంది, నూతన అవకశాలు పొందుటకు ఆస్కారం ఉంది. అనుకున్న పనులను పూర్తిచేస్తారు, కాకపోతే నూతన పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకొనే ముందు బాగా ఆలోచించండి. ఆది, సోమవారాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట వలన మేలుజరుగుతుంది. మోకాళ్ళనొప్పుల మూలాన సమస్యలు పొందుతారు. కొత్త పనులను చేపట్టుట వలన శ్రమను తద్వారా ఇబ్బందులను పొందుటకు ఆస్కారం ఉంది. మంగళ, బుధవారాల్లో కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కీలకం అయ్యే అవకాశం ఉంది కావున బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. పెద్దల సూచనలు పాటించుట ఉత్తమం. గురువారం తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసి విజయంను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. వారంమొత్తం మీద తలపెట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో సరైన ప్రణాళిక ఉన్నచో విజయాలను పొందుతారు. శరీరసౌఖ్యంను పొందుతారు. ఇష్టమైన పనులను చేపట్టి సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. నూతన పనులను ఆరంభించుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. వినోదములకు సమయానికి కేటాయించే అవకాశం ఉంది. సరదాగా గడుపుటకు ప్రాముఖ్యత ఇస్తారు. చర్చలలో పాల్గొంటారు మీయొక్క ఆలోచనలను పంచుకొనే అవకాశం కలదు. అకారణంగా భీతిని పొందుటకు అవకాశం కలదు. కొన్ని విషయాల్లో విచారంను పొందుతారు.

సింహ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను కలిగి ఉంటారు. నూతన అవకాశాల కోసం చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులను ఉత్సాహంతో పూర్తిచేసే అవకాశం ఉంది. మీ వలన తోటివారు సహాయంను పొందుఅవకాశం ఉంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. ఆది, సోమవారాల్లో నూతన అవకాశాలు పొందుతారు. స్త్రీ/పురుష సౌఖ్యంను కలిగి ఉంటారు. నలుగురిలో మంచిపేరుకోసం చేయుప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చు అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చును తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో అనుకోని ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన పనులను ఆరంభించకపోవడం ఉత్తమం. నిదానంగా వ్యవహరించుట సూచన. గురువారం కుటుంబంలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. వారంమొత్తం మీద బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో అనుకోని ఖర్చులు కలుగుతాయి. చంచల మనస్సును కలిగి ఉంటారు. స్థిరమైన ఆలోచనలు చేయుట మంచిది. స్నేహితులతో కలిసి చేపట్టిన పనుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటే మేలుజరుగుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. మాటపట్టింపులకు పోకండి అకారణంగా వివాదములు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. కుటుంబసభ్యుల వలన పనిభారంను పొందుతారు, వారితో సర్దుబాటు వ్యవహారం కలిగి ఉండుట చేయండి, మంచిది. వ్యతిరేకవర్గం వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును.
 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తలపెట్టిన పనులలో అనుకోని ఆటంకాలు కలుగుటకు ఆస్కారం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో గట్టి ప్రయత్నం చేయుట వలన లాభిస్తుంది శ్రమను పొందుతారు. ఆది, సోమవారాల్లో కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు సంతోషంగా గడిపే అవకాశం ఉంది. తోటివారికి సహయం చేయాలనే ఆలోచన చేస్తారు, మీ వలన కొంత మంది ఉపకారం పొందుతారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని గడుపుతారు. మంగళ, బుధవారాల్లో ఆర్థికాభివృద్ధిని పొందుతారు. నూతన అవకాశాల కోసం చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. నలుగురిలో మీరు ఆశించిన గుర్తింపును పొందుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయనికి పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. గురువారం ప్రతిపనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మొదలు పెట్టుట మంచిది. ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. వారంమొత్తం మీద ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు, నిదానంగా ఆలోచించి ప్రారంభిచుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో తీసుకొనే ప్రతి నిర్ణయం బాగా ఆలోచించి తీసుకోవడం అనేది సూచన తొందరపాటు నిర్ణయం వద్దు. గాయములు అయ్యే అవకాశం కలదు జాగ్రత్త. ప్రయత్నాలలో కొంత ప్రణాళికను జతచేయుట ద్వారా తప్పక అనుకూలమైన ఫలితాలు పొందుతారు ప్రయత్నం ముఖ్యం. ఇష్టమైన పనులలో ముందుకు వెళ్తారు. క్రిందిస్థాయి వారి వలన సహాయంను పొందుతారు లాభం ఉంటుంది.

తులా రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో బంధుమిత్రులతో విరోధములు కలుగుటకు అవకాశం ఉంది, కావున సర్దుబాటు విధానం కలిగి ఉండుట మేలుచేస్తుంది. నూతన ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. పనులను ఆరంభించాల్సి వస్తే గట్టి ప్రయత్నం అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆది, సోమవారాల్లో ఒకవార్త బాధను కలిగించేదిగా ఉండు అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి మంచిది. ప్రయాణాలు వాయిదా వేయుట ఉత్తమం, చేపట్టు ప్రతి పనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయుట ఉత్తమం. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. నూతన అవకశాలు పొందుతారు. ఉద్యోగంలో మార్పును పొందుతారు. గురువారం నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు. వారంమొత్తం మీద ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను ఆరంభించే అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. సంచారం చేయవలసి రావొచ్చును అలసి పోయే అవకాశం ఉంది జాగ్రత్త. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం మేలుచేస్తుంది. బంధుమిత్రుల వలన గౌరవం పెరుగుతుంది, వారి మూలాన లాభంను పొందుతారు. పెద్దలతో పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది వారి వలన మంచి జరుగుతుంది.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభించి పనులను విజయ వంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. బంధువులతో సమయాన్ని గడుపుతారు. ధనమునకు సంభందించిన విషయాల్లో కొంత సహకారం ఇతరులనుండి పొందు అవకాశం ఉంది. మనోదైర్యంను కలిగి ఉండి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఆది, సోమవారాల్లో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. అనుకున్న దానికన్నా అధికమైన ఖర్చును కలిగి ఉంటారు. చిన్న చిన్న పనుల కోసం అధికమైన సమయం కోల్పోయే అవకాశం ఉంది. ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు అనుకూలించకపోవచ్చును, వీలైనంత వరకు వాయిదా వేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులను పొందుతారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి వాటిని అశ్రద్ద చేయకండి. నూతన పనులను ఆరంభించక పోవడం మేలుచేస్తుంది. పనుల విషయంలో పెద్దల సూచనలు పాటించుట మంచిది. గురువారం అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళుట చేత లాభంను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న అవకశాలు మొదలు అవుటకు ఆస్కారం ఉంది. వారంమొత్తం మీద వ్యాపారంలో, వ్యవసాయంలో గాని బాగాఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. అనుకోని ఖర్చులు కలుగుట వలన సమస్యలు కలుగుతాయి. తలపెట్టిన పనులలో ఒకఅడుగు ముందుకు వేయుటకు అవకాశం ఉంది. ప్రయత్నాలు లాభించుట చేత కొంత సంతృప్తిని కలిగి ఉంటారు. మంచివారితో మీకున్న పరిచయాల మూలాన మేలుజరుగుతుంది. నూతన అవకశాలు కలుగుటకు ఆస్కారం ఉంది. వ్యాపారంలో మాత్రం నష్టం పొందుతారు. ధనము విషయంలో మాత్రం నిదానం చాలా అవసరం. అనుభవం ఉపయోగపడుతుంది.

ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో మాటలను పొదుపుగా వాడుట సూచన. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం కలదు. ధనమునకు సంబంధించిన విషయాల్లో కొంత ఆలోచించి అడుగులు ముందుకు వేసినచో నష్టం తగ్గుటకు ఆస్కారం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును జాగ్రత్త. ఆది, సోమవారాల్లో ఇష్టమైన వారితో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు కలుగుతాయి. కాకపోతే ప్రతి పనిని ఆచితూచి ఆరంభించుట సూచన. ప్రయాణాలు చేయకండి అలసి పోయే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట సూచన. గతంలో ఆరంభించిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయండి ఉత్తమం. కొత్త కొత్త ఆలోచనలు ఉన్నను కొంత వేచి చూసే దొరని మంచిది. గురువారం అశుభవార్తను వినే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండుట వలన అపజయాన్ని తట్టుకొనే శక్తిని కలిగి ఉండవచ్చును. ప్రతీ పనిని బాగా ఆలోచించి మొదలు పెట్టుట ఉత్తమం. వారంమొత్తం మీద పనిఒత్తిడి ని కలిగి ఉంటారు, సమయానికి భోజనం చేయుట అనేది సూచన. అనారోగ్యసమస్యల మూలాన ఇబ్బందులు పొందుతారు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. సంచారం చేయవలసి రావొచ్చును, కావున తగిన విధంగా నిర్ణయాలు తీసుకోండి లేకపోతే శ్రమను పొందుతారు. బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి అందుచేత కొంత నిరుత్సహంను పొందు అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషంను పొందుతారు, ఇంకాకాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి ఉత్తమం. వస్త్రలాభంను కలిగి ఉంటారు.

మకర రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు, విందులలో పాల్గొను అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగుంటుంది. అధికారులతో గుర్తింపును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మెరుగుదల ఉంటుంది. చిన్న చిన్న పనులను పూర్తిచేయుట ద్వారా లాభంను పొందుతారు. ఆది, సోమవారాల్లో వ్యాపారంలో ధననష్టం పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు పొందుటకు ఆస్కారం ఉంది కావున తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి లేకపోతే సమస్యలు కలుగుటకు అవకాశం  ఉంది. మంగళ, బుధవారాల్లో నూతన పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలించే అవకాశం ఉంది. గురువారం ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు చేయుట ఉత్తమం. పెద్దలతో చర్చలు చేయుటకు ఆస్కారం కలదు. మీకంటూ ఒక విధానం ఉండుట సహయం చేస్తుంది. బంధుమిత్రులతో ఆలోచనలు పంచుకుంటారు. వారంమొత్తం మీద స్థానచలనం పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాల మూలాన ఇబ్బందులు కలుగుతాయి. ధనమునకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యసమస్యలు పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. పెద్దల సూచనలు పాటించుట వలన వివాదములు తొలగుటకు ఆస్కారం ఉంది. చేయువృత్తిలో అనుకోని చిక్కులు పొందుతారు నిదానం అవసరం. ముఖ్యంగా ధనమునకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. స్త్రీ/పురుష పరమైన విషయాల్లో అధికమైన శ్రద్ధను కలిగి ఉండే ఆస్కారం ఉంది.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మీయొక్క మాటతీరు వివాదములకు దారి తీసే అవకాశం ఉంది, నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. తలపెట్టిన పనులు అధికమైన ఖర్చును కలిగి ఉండే అవకాశం ఉంది. ధననష్టం జరుగుతుంది జాగ్రత్త. ఆది, సోమవారాల్లో నూతన ఆలోచనలు ముందుకు కదులుటయై వాటి మూలాన నచ్చిన పనులను చేపట్టు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా అడుగులకు వేయుట వలన లాభంను పొందుతారు. దూరప్రదేశాల నుండి వార్తను వినే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మాత్రం నిదానం అవసరం. మంగళ, బుధవారాల్లో మాటలు పొదుపుగా వాడుట అనేది సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు మాత్రం నిదానం అవసరం. అనుభవం తప్పక ఉపకరిస్తుంది అని తెలుసు కుంటారు. పెద్దలతో చర్చలు చేయుటకు ఆస్కారం కలదు వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. గురువారం నచ్చిన వారిని కలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. కుటుంబంలో ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయుట మంచిది. వారంమొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో ధనలాభంను పొందుతారు. నూతనఅవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. అధికారులకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకొంటారు. ఋణముల వలన ఇబ్బందులు కలుగుతాయి. ధనమునకు సంబంధించిన విషయాల్లో లెక్క చెప్పవలసి రావొచ్చును, ఓర్పును కలిగి ఉండుట తప్పక మేలుచేస్తుంది. సమయానికి భోజనం తీసుకొనే ప్రయత్నం చేయండి. ప్రయత్నాలు కొద్దిగా ప్రయత్నం పెంచుట చేత సానుకూలపడే అవకాశం ఉంది. నూతన నిర్ణయాలు చేయునపుడు సాధ్యా సాధ్యాలు చూడటం అనేది సూచన. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.

మీన రాశి
వారం మొత్తం మీద పెద్దలను కలిసి నూతన పనులను ఆరంభించే అవకాశం కలదు. వారి సూచనలు పాటించుట వలన పేరును పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో అనుకోని సంఘటనలు జరుగుట వలన వివాదములు కలుగుటకు అవకాశం ఉంది. కొంత మీరు విచారంను పొందుతారు. ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో బంధువులతో, మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, తలపెట్టిన పనులలో ఆర్థికపరమైన లాభంను పొందుతారు. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కలదు. అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండుట చేత పనులను పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఆది, సోమవారాల్లో ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి మంచిది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ప్రతి పనిలో సర్దుబాటు విధానం అవసరం. ప్రయాణాలు చేయునపుడు నిదానం మంచిది. వీలయితే వాటిని వాయిదా వేయుట ఉత్తమం. మంగళ, బుధవారాల్లో వ్యాపారంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు వద్దు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత నిదానం మంచిది. ఉద్యోగంలో మాత్రం ఒత్తిడిని కలిగి ఉంటారు. గురువారం ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి వాటిని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలలో లాభంను పొందుతారు.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
credit cards