Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope janaury 03- janaury 09

ఈ సంచికలో >> శీర్షికలు >>

క్రెడిట్ కార్డ్స్ - బన్ను

credit cards

నా చిన్నతనంలో "పాత సామాన్లు కొంటాం..." అంటూ ఒకాయన వచ్చేవాడు. అదే 'చెట్టుకింద ప్లీడర్' సినిమాలో వంశీగారు చూపించారు. అలాగే ఇప్పుడు 'క్రెడిట్ కార్డులిస్తాం" అంటూ బ్యాంకుల వాళ్ళు ఉద్యోగస్తుల వెనక పడ్డారు. 'క్రెడిట్ కార్డ్' వల్ల ఉపయోగాలు, నష్టాలు మీకు తెలియచేస్తాను.

ఉద్యోగస్తులు సాధారణంగా ఇలా మాట్లాడుకోవటం నేను విన్నాను. 'నీకు ఫలానా క్రెడిట్ కార్డ్ వచ్చిందంట కదా... లిమిటెంతిచ్చాడు?' అవతల వ్యక్తి '60 ఇచ్చాడు' అన్నాడు. 'అంతేనా... నాకు 75 ఇచ్చాడు' అంటూ ఉప్పొంగిపోయాడు. వాళ్ళేదో 'ఫ్రీ' గా ఇచ్చినట్టు ఫీలయిపోవటం చూసి నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఆ బాధ నేను అనుభవించాను కాబట్టి! మనం క్రెడిట్ కార్డు మీద ఓ 50 వేలు వాడామనుకోండి. మినిమమ్ 2,500 కట్టమంటాడు. అలా మీరు ఎన్ని నెలలు కట్టినా ఆ అప్పు తీరదు. దానిక్కారణం 50-2,500=47,500+interest మళ్ళీ 50 దగ్గరే వుంటుంది. ~~మరో ఉదాహరణ చూడండి..క్రెడిట్ కార్డ్ పైన ఒక లక్ష రూపాయలు పెట్టి ఎల్సీడీ టీవీ కొన్నామనుకోండి, అది ఈ ఎం ఐ  రూపంలో తీర్చడానికి ఎంత కాలం పడుతుందో తెలుసా? అక్షరాలా ముప్పై సంవత్సరాలు...

క్రెడిట్ కార్డ్ వస్తే మనకేదో లాటరీ తగిలినట్టు ఫీలయ్యి మనం ఖర్చు పెట్టేస్తాం. కానీ అది 'అప్పు' అని గ్రహించం. అప్ప మాత్రమే కాదు, ఇంట్రస్టుతో కూడిన అప్పు. ఆ విషయం గుర్తించి ఖర్చుపెట్టండి. ఇహపోతే, క్రెడిట్ కార్డు వల్ల ఉపయోగాలు లేకపోలేదు. చక్కగా వినియోగిస్తే మనకే లాభం. అదెలాగో వినండి: మీ బిల్లింగ్ సైకిల్ (అంటే మీ బిల్ జనరేటయ్యే రోజు) 17 వ తేదీ అనుకోండి... 18 నుంచి 30 వ తేదీ వరకు ప్రతీ ఖర్చు క్రెడిట్ కార్డు ద్వారా చేయండి. గుర్తు పెట్టుకొని ఆ మొత్తాన్ని వచ్చేనెల 15 లోపు కట్టేయండి. మీకు వడ్డీ పడదు. ఇంకా 'పే-బాక్' పాయింట్స్ లేదా 'రివార్డ్ పాయింట్స్' ఇస్తారు. అవి మీ మీదున్న ప్రేమతో బ్యాంకు వాళ్ళు ఇచ్చేవి కాదు. మీరు పర్చేజ్ చేసే వాళ్ళదగ్గర నుంచి 2% మాస్టర్/వీసా కార్డు వాళ్ళు తీసుకుంటారు. అందులో 1% మీకు పాయింట్స్ గా ఇస్తారంతే!

క్రెడిట్ కార్డ్ వాడే ముందు మీలో కొందరైనా నా సలహా పాటిస్తారని ఆశిస్తాను.

మరిన్ని శీర్షికలు
iruku jeevithalu