Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lady directors

ఈ సంచికలో >> సినిమా >>

2013 సౌందర్యాంజలి

2013 soundaryanjali

తెలుగు తెరపై తెలుగమ్మాయిలకు హీరోయిన్‌గా అవకాశాలు రావడంలేదని చాలామంది వాపోతారు. అది నిజం కూడా. కానీ, తెరపై అవకాశాలు సాధించడం వరకూ ఫర్వాలేదుగానీ, నిలదొక్కుకోవడంలోనే చాలామంది తెలుగమ్మాయిలు విఫలమవుతున్నారు. స్టార్‌ డమ్‌ ఇటీవలి కాలంలో ఏ తెలుగు హీరోయిన్‌కీ రాలేదు, ఒక్క అంజలికి తప్ప.

వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించింది అంజలి. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వివాదాలు ఆమెను వార్తల్లో వ్యక్తిని చేశాయి. కెరీర్‌ పరంగా ఆమెకు ఈ వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయేమోనని అనుకున్నారు కొందరు. కానీ, అంజలికి అవి ప్లస్‌ పాయింట్స్‌గానే మారాయి పబ్లిసిటీ విషయంలో.

2013లోనే ‘బలుపు’ సినిమాతో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకుంది అంజలి. సౌందర్య తర్వాత తెలుగులో ఆ స్టేచర్‌ వున్న పాత్రలు అంజలికి దక్కుతుండడం గొప్ప విషయమే. అయితే కెరీర్‌ని బిల్డప్‌ చేసుకోవడంలో అంజలి తప్పటడుగులు వేస్తోందన్న విమర్శలున్నాయి. ఏ విమర్శలు ఎలా ఉన్నా, 2013లో హీరోయిన్‌గా అంజలి మంచి మార్కులే వేయించుకుంది.

మరిన్ని సినిమా కబుర్లు
varma new heroine