Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
2013 soundaryanjali

ఈ సంచికలో >> సినిమా >>

వర్మగారి కొత్త హీరోయిన్‌

varma new heroine

సంచలన దర్శకుడు వర్మ ‘పట్టపగలు’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోందీ సినిమా. సాధారణంగా వర్మ సినిమాల్లో హీరోయిన్‌ అంటే ఎక్కువగా ముంబై నుంచి ఇంపోర్టెడ్‌ సరుకే అవుతుంది. ముంబై భామల మీద వర్మకి వున్న ప్రత్యేకమైన అభిమానమే అందుక్కారణం కావొచ్చు.

ముంబై భామల విషయం అలా ఉంచితే, వర్మ ప్రమోట్‌ చేసిన తెలుగు హీరోయిన్లలో మధుషాలిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ‘డిపార్ట్‌మెంట్‌’ సినిమాలో మధుషాలినికి మంచి పాత్రే దక్కింది. ఆ తర్వాత అలాంటి ఛాన్స్‌ మళ్ళీ స్వాతి దీక్షిత్‌కి దక్కింది. నటన పరంగా ఆమెకు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత వుంటుందట.

వర్మ హీరోయిన్‌... అన్న బ్రాండ్‌ కోసం అందాల భామలు తహతహలాడతారు. ఊర్మిళ రేంజ్‌లో ఆ తర్వాత వచ్చిన హీరోయిన్లు కొందరు పాపులారిటీ సంపాదించుకున్నా, ఈ మధ్య వర్మ హీరోయిన్లు జస్ట్‌ ఫర్వాలేదన్పిస్తున్నారంతే. స్వాతి దీక్షిత్‌ మళ్ళీ వర్మ బ్రాండ్‌ హీరోయిన్‌గా వెండితెరపై ఈ సినిమా తర్వాత వెలిగిపోతుందేమో చూడాలిక.

 

మరిన్ని సినిమా కబుర్లు
sridevi in bikini