Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Biscuit

ఈ సంచికలో >> సినిమా >>

రావణ నా డ్రీమ్ ప్రాజెక్ట్ - మంచు విష్ణు

Interview with Manchu Vishnu
సినిమా పరిశ్రమలో మంచు కుటుంబానిది ఓ విశిష్ట స్థానం. వారిది ఓ విభిన్న శైలి. మిగిలిన కథానాయకులకు మోహన్ బాబుకు ఎంతో తేడా. అలాగే మోహన్ బాబు పిల్లలది కూడా. ఇండివిడ్యువాలిటీ, బాధ్యతలు, కొత్త ఆలోచనలు, ఎవరు ఏమనుకున్నా తాము అనుకున్నది చేయడం అన్నవి వారికి వారసత్వంగా వచ్చిన లక్షణాలు. విద్యార్థిగా వుంటూనే డాట్ కామ్ వ్యాపారంలో తన ప్రతిభ చూపాడు విష్ణు. తన దైన శైలిలో , తన తరహాలో తాను సినిమా నిర్మాణం సాగిస్తూ, వరుసగా రెండు హిట్ లు కొట్టాడు. తాజాగా పాండవులు పాండవులు తుమ్మెద అంటూ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు శ్రీకారం చుట్టాడు. ఈ యువ హీరోతొ గో తెలుగు ముఖాముఖి:

*హాయ్..గో.తెలుగు చూసారా..
-మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడే చూసాను.చాలా హోమ్లీగా వుంది.

*ఎలా వుంది ఇప్పుడు మీ కెరీర్
-ఫైన్..మీకు తెలుసుగా దేనికైనారెడీ,దూసుకెళ్తా.. మంచి హిట్ లు..

*ఆడియన్స్ పల్స్ పట్టారా?
-అది చాలా పెద్ద మాట,.ఇన్నాళ్లూ ఒకలా వున్నాను. ఇప్పుడు కాస్త ఐడియా వచ్చింది. అంతే

*మరికొంచెం వివరంగా
-కథలు, ట్రెండ్ ఇలాంటివి అన్నీ ఇప్పుడు బాగా గమనించగలుగుతున్నాను.తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను

*మీ సినిమా బడ్జెట్ ఏ మేరకు వుంటే రిస్క్ వుండదు అన్న ఐడియా వచ్చిందా?
-యా..ఇప్పుడు నా మీద నేను 10 నుంచి 15వరకు ఇన్వెస్ట్ చేసినా ఫరవాలేదు అన్న ధైర్యం వచ్చింది.

*రామ్ గోపాల్ వర్మ ప్రాజెక్ట్ ఎలా వుంది..ఎంతవరకు వచ్చింది.
-అదో మంచి అనుభవం అండీ. నాకు చాలా ఇష్టం ఆయన డైరక్షన్ లో చేయాలని అది తీరింది. పైగా నాన్నగారి పాత్ర నిజంగా ఎక్సార్డినరీ. ఇంతవరకు ఆయన ను ఆ రేంజ్ లో చూడలేదు,

*రాయలసీమ రామన్న చౌదరి టైప్ నా
-ఇంకా పవర్ పుల్.

*వర్మ వర్కింగ్ స్టయిల్ ఎలా వుంది?
-ఆయన స్టయిల్ డిఫరెంట్. మూడు కెమేరాలు, చకచకా షూటింగ్. నెరేషన్.అంతా ఓ అద్భుతం.

*పూరి సినిమా కూడా వుందని వినికిడి
-వుంటుంది. ఈ రెండు సినిమాలు చేయడం, ఆ తరువాత రావణ చేస్తే నా కోరికలు తీరిపోతాయి. పూరి గారితో సినిమా అంటేనే ఎక్సయిటింగ్

*రావణ సంగతేమిటి?
-యాభై కోట్ల బడ్జెట్ అండీ. కానీ హాలీవుడ్ లో 300 కోట్ల తో తీసిన లుక్ వస్తుంది. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్.

*వర్కవుట్ అవుతుందా?
-నాన్నగారు, రాఘవేంద్రరావు గారు అంటే వర్కవుట్ కాకపోవడం ఏమిటి?

*ఇకపైనన్నా వివాదాలకు దూరంగా వుంటారా?
-మీరు నమ్మరు. నేను వివాదాలకు చాలా దూరం. నాకు ఎవరిపైనన్నా కోపం వచ్చినా, నాకు నచ్చకున్నా, అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతా కానీ గొడవ పడను. సూటిగా మాట్లాడాలని వున్నా మాట్లాడను. నాన్నగారికి చెల్లినట్లు నాకు చెల్లాలంటే వీలవుతుందా..నాకు ఆ మాత్రం తెలుసు. నిజానికి మీరు దేని గురించి అంటున్నారో నాకు తెలుసు. మీరు నమ్మండి. మా బావ ఆర్థడాక్స్ బ్రాహ్మిన్. మేమెంతో గౌరవంగా చూస్తాం.

*ఆయనేం చేస్తారు.
- యుఎస్ లో వొరాకిల్ స్పెషలిస్ట్. టాప్ లైన్ లో వున్నారు.

*విన్నీ ఎలా వుంది.
-ఫైన్. తను ఇఫ్పుడిప్పుడే పిల్లల వ్యవహారంతో పాటు నా స్ప్రింగ్ బోర్డు చైన్ స్కూళ్ల వ్యవహారాలు కూడా చూస్తోంది. వాటిని మరిన్ని ప్రారంభించబోతున్నాం. మా బావను కూడా ఇన్ వాల్వ్ చేస్తాం.

*వినీ మీ వాళ్లందిరికీ చేరికయ్యిందా?
-మీకు తెలుసా భువనేశ్వరి ఆంటీ వినీ మంచి ఫ్రెండ్స్.

*పిల్లలు ఇద్దరూ
-ఓ..వాళ్లే నా లోకం.

*ఇద్దరూ ఒకేలా వుంటారు..బిహేవియర్.
-అమ్మో..చెరో టైప్...ఒకరు సాప్ట్..ఒకరు హార్డ్. మొన్న రజనీ అంకుల్ అన్నారు. మీ నాన్న ఓ పాపలో వున్నాడురా..జాగ్రత్త అని.

*రాజకీయాల్లోకి ఎవరెవరు వస్తున్నారు మీ ఇంట్లో?
-ఎవరమూ రాము. మాకు అందరితో మంచి సంబంధాలు వున్నాయి. బాబు అంకుల్, భువనేశ్వరి ఆంటీ, పురంధ్రీశ్వరి ఆంటీ, జగన్ బావ ఇలా అందరితో. జగన్ ఇంటికి వెళ్లే మేమంతా చాలా సరదాగా కలిసిపోతాం. ఎందుకు ఒకరితో చేరి మిగిలిన వారికి చెడ్డ అవ్వాలి. అందుకే న్యూట్రల్ గా వుండిపోవడమే.

*ఇంకేమిటి విశేషాలు
-ఏముందండీ..చాలా ప్రాజెక్ట్ లు, ఆశలు వున్నాయి. వన్ బై వన్ చేయాలి. మంచి పేరు తెచ్చుకోవాలి అంతే.

కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu