Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంకాయ, ములక్కాడ కూర - పి. శ్రీనివాసు

కావలసిన పదార్థాలు:
వంకాయలు, ములక్కాడలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర

తయారు చేయు విధానం:
ముందుగా వంకాయ, ములక్కాడలను కోసి నీటిలో వేసి పెట్టుకోవాలి. తరువాత బాణీలో నూనె పోసి అది కాగిన తర్వాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వెయ్యాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. దానిలో వంకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తరువాత దానిలో టమాటా ముక్కలు వేసి అటు ఇటు తిప్పి కొంచెం మగ్గిన తరువాత దానిలో కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టాలి. కొంచెం సేపు తర్వాత మూత తీసి పైన కొత్తిమీర జల్లి సన్న మంట మీద ఉంచితే వంకాయ, ములక్కాడ కూర రెడీ.

మరిన్ని శీర్షికలు