Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Baahubali - 100 Crores Budget

ఈ సంచికలో >> సినిమా >>

ఎంఎం శ్రీలేఖ తెలుగువారికి గర్వకారణం

mm sreelekha proud of telugu people

మహిళా సంగీత దర్శకులు చాలా తక్కువమంది వున్నారు సినిమా రంగంలో. తెలుగులో వారి సంఖ్య మరీ తక్కువ. ఎస్‌ జానకి, లతా మంగేష్కర్‌ లాంటివారు ఒకటీ అరా సినిమాలకు సంగీతం అందించారే తప్ప, వారేమీ పూర్తిస్థాయి సంగీత దర్శకులుగా రాణించలేదు. కాని ఓ తెలుగు మహిళ, అందునా 12వ ఏట సినీ సంగీత ప్రపంచంలో అడుగు పెట్టి, వేరెవరికీ సాధ్యం కాని రీతిలో వెలుగొందుతున్నారంటే అది చాలా గొప్ప విషయం కదా. ఆమె ఓ తెలుగు మహిళ కావడం మనందరికీ గర్వకారణం. తెలుగు సినీ పరిశ్రమలో ఎంఎం శ్రీలేఖ ప్రస్తానం చాలా గొప్పది. సోదరుడు కీరవాణి గొప్ప సంగీత దర్శకుడైనా, ఆయన నీడలో కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఎం.ఎం. శ్రీలేఖ వందేళ్ళ సినిమా ప్రస్తానంలో ఓ అద్భుతం అనే చెప్పాలి. పురుషాధిక్యం.. సినీ పరిశ్రమలో ఎక్కువగా కన్పిస్తుంది. కానీ, శ్రీలేఖ దాన్ని అధిగమించారన్నది నిర్వివాదాంశం.

మరిన్ని సినిమా కబుర్లు
Silver Jubilee for Ram Gopal Varma